వేసవిలో ఎక్కువగా దొరికే పండ్లు మామిడి.. ఈ పండ్లను వేసవి లో మాత్రమే చూస్తాము.. అయితే ఏడాది పొడవునా వీటి రుచి తెలియాలని రకరకాలుగా చేసి వాటిని స్టోర్ చేస్తారు. అయితే ఈ వేసవిలో మామిడి తో కొత్త రుచులు కూడా ట్రై చేస్తుంటాం.. పిల్లలు ఇష్టంగా తినే మరొక వంట కూడా ఉంది.. అదే మ్యాంగో శ్రీఖండ్.. ఎక్కువ మందికి దీనిని చేయడం తెలియదు. రెస్టారెంట్ లో కొని తెచ్చుకుంటారు.. అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. 

మ్యాంగో శ్రీఖండ్ ని ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర లో తయారు చేసుకుంటూ ఉంటారు. దీనిని మనం మామూలుగా తినేయొచ్చు లేదంటే పూరి మరియు బంగాళదుంప కూర తో తీసుకున్న బాగుంటుంది... 

కావలసిన పదార్థాలు: 

రెండు కప్పులు పెరుగు
ఒక కప్పు మామిడి గుజ్జు
అర కప్పు పంచదార పొడి
కొద్దిగా యాలుకల పొడి
ఒక టీస్పూన్ పాలు
చిటికెడు కుంకుమ పువ్వు
పిస్తా
బాదం పప్పు

తయారీ విధానం: 


ముందుగా ఒక క్లాత్ తీసుకొని అందులో పెరుగు వేయండి. అలా మూడు నుంచి నాలుగు గంటల సేపు వదిలేయండి. మూడు నుంచి నాలుగు గంటల తర్వాత ఆ గుడ్డ తీసేసి ఇప్పుడు బౌల్లో పెరుగుని వేసుకోండి. ఆ బౌల్ ని ఫ్రిజ్ లో పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటల సేపు అలా వదిలేయండి. ఇకపోతే పాలలో కుంకుమ పువ్వు వేసుకొని నాన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన బౌల్ తీసి దానిలో పంచదార పొడి, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ని కూడా వేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మామిడి గుజ్జు, యాలుకల పొడి, కట్ చేసుకున్న బాదం పిస్తా మొత్తం అన్నీ వేసి ఫ్రిజ్లో ఒక గంట సేపు ఉంచండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ వేసి డెకరేట్ చేసుకుంటే చాలు. చాలా రుచికరమైన మ్యాంగో శ్రీఖండ్ రెడీ.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: