నేటి రోజు ల్లో గడ్డం పెంచుకోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా గడ్డం పెంచుకుంటే ఎక్కువ అందంగా కనిపిస్తున్నాము అని నమ్ముతున్నారు అందుకే ప్రస్తుతం గడ్డం పెంచుకోవడం ఒక ట్రెండ్ గా భావిస్తున్నారు. ఈ క్రమం లోనే ప్రస్తుతం యువకులు మొత్తం ఎక్కడ చూసినా కూడా   గడ్డం తోనే కనిపిస్తున్నారు. అయితే సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం కొంతమంది గడ్డం పెంచుకోకూడదు అని తెలిసినప్పటికీ కూడా గడ్డం పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.



 ఈ నేపథ్యం లోనే ఎన్నో సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఇక ఎవరైనా సాంప్రదాయాలను పాటించాలి అని సలహా ఇస్తే..  టెక్నాలజీ యుగంలో గడ్డం పెంచుకోకుండా సంప్రదాయాలను పాటించడం ఏంటి అని అందరూ చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సాంప్రదాయాల్ని గుర్తు చేయడానికి ఇక్కడ కొంతమంది ఒక వినూత్న ఆలోచన చేశారు సాధారణంగా అయితే వారి సాంప్రదాయం ప్రకారం అసలు ఎవరు కూడా గడ్డం పెంచుకో కూడదు కానీ నేటి రోజు ల్లో ట్రెండ్ ఫాలో అవుతున్నాము అని చెబుతూ ఎంతో మంది గడ్డం పెంచుకుంటున్నారు. ఎన్ని సార్లు చెప్పిన వారిలో మార్పు మాత్రం రాలేదు.



 ఈ క్రమం లోనే వినూత్న ఆలోచన చేశారు పుదుచ్చేరి  కరాయికల్ జిల్లా లోని జాలరి గ్రామా ల్లో  ప్రజలు. సాంప్రదాయాన్ని కాపాడడానికి వింత నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ఎవరైనా యువకుడు గడ్డం పెంచుకుంటే ఇక అతను పెళ్లికి ఎవరు కూడా వెళ్ళద్దు అంటూ తీర్మానం చేశారు. గడ్డం తో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారి వివాహాల ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సంప్రదాయాలు పాటించకుండా ఎంతోమంది గడ్డం పెంచుకుని అలాగే పెళ్లి చేసుకుంటున్నారు అని ఇకనుంచి సాంప్రదాయాలను కాపాడటానికి నడుం బిగించామని అందుకే గడ్డం లేకుండా క్లీన్ షేవ్ చేసుకున్న వారి పెళ్లిళ్లకు మాత్రమే వెలతాము అంటూ గ్రామస్తులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: