కరోనా ప్రభావం రోజు రోజుకు ఊహకు అందని విధంగా వ్యాపిస్తుంది. మొదటి సారి వచ్చిన ప్రభావం కన్నా రెండో సారి వస్తున్న కరోనా చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకున్న వారికే కరోనా సోకడంతో జనాలు ఆందోళనలో ఉన్నారు. అయితే, కరోనా ప్రభావం తగ్గాలంటే ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఏవేవో పోస్ట్ లు పెడుతుంటారు. వాటిని నమ్మి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 


తాజాగా పచ్చి ఉల్లిపాయల తో పాటు ఉప్పు కలిపి తీసుకుంటే 15 నిమిషాల్లో వైరస్ పోతుందని.. వైరస్ బారినపడిన వెంటనే తొలగిపోతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది ఫేక్ అని ఇన్వెస్టిగేషన్ చేసిన డాక్టర్లు చెప్పారు.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వార్త నిజమా కాదా అని విచారించారు. దీనిలో తేలిందేమిటంటే ఈ పోస్ట్ ఫేక్ అని, ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ 15 నిమిషాల్లో మాయం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఆనియన్ అసోసియేషన్ యుఎస్ కూడా ఇది ఫేక్ అని రుజువు చేశారు..


ఇలా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వైరస్ పోతుందని అనుకోవడం మూర్ఖత్వం అని సదరు నిపుణులు పేర్కొన్నారు..అయితే,సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని ఒక ఉల్లిపాయ ముక్క టాక్సిక్ జెర్మ్స్ ని తొలగిస్తుందని ఆపోహ ఉంది.. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ ను ఇది తొలగించలేదు అని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ప్రాణాంతకమైన వైరస్ ను అరికట్టడానికి నివారణ ఒకటే మార్గం అందుకోసం.. జనం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లకుండా ఉండటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు వేసుకోవడం, చేతుల్ని పదేపదే శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ని ఉపయోగించడం మాత్రమే.. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: