ఎవరికన్నా హార్ట్ ఎటాక్ వచ్చిందని వింటే చాలు అమ్మో!  హార్ట్ ఎటాక్ వచ్చిందా అని నోరు వెళ్లబెడతాం కదా.. ఎందుకంటే గుండె నొప్పి రావడం అంటే మాములు విషయం కాదు కదా. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు హార్ట్ ఎటాక్ అనేది ఎక్కువగా మగవారిలో మాత్రమే వస్తుంది ఆడవాళ్ళలో తక్కువగా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవం  హార్ట్ ఎటాక్ అనేది పురుషుల్లోనూ,  మహిళల్లోనూ తలెత్తే అవకాశాలు సమాన స్థాయిలో ఉంటాయి. హార్ట్‌ ఫెయిల్యూర్‌, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ లాంటి గుండె సమస్యలు ఇరువురికీ ఒకేలాగా వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.అసలు నిజం చెప్పాలంటే హార్ట్ ఎటాక్ బారిన పడే అవకాశాలు ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉన్నాయి.  మహిళలు రోజు వారి పనిలో పడి వల్ల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ పట్టించుకున్నా పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల అలా ఉందేమో అని చాలా మంది భావిస్తుంటారు.


కానీ మహిళలు అయినా పురుషులు అయినాగాని హార్ట్ ఎటాక్ బారిన పడతారు అనడానికి మన శరీరం కొన్ని రకాల సూచనలు చేస్తూ ఉంటుంది.ఆ సూచనలను బట్టి తగిన జాగ్రత్తలు వహించి ఎవరి ఆరోగ్యాన్ని వారు  మెరుగుపరుచుకోవాలి. అయితే మహిళల్లో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికయినా సరే వయసుతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది. మహిళల్లో అప్పుడప్పుడు వచ్చే  ఛాతి నొప్పి కూడా హార్ట్ ఎటాక్ కి ఒక సూచన అని చెప్పవచ్చు.అలాగే వారి  పొట్ట పైభాగం బాగా పెరిగి నొప్పి కలగడం కూడా ఒక సూచన అని చెప్పవచ్చు. అలాగే ఒక్కోసారి పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది.అలాగే ఒక్కోసారి వెన్ను నొప్పి తీవ్రంగా రావడం కూడా హార్ట్ ఎటాక్ కి ఒక సూచన అని చెప్పవచ్చు.



అలాగే కొంతమంది ఎటువంటి చిన్న పని చేసినాగాని ఊపిరాడనట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బంది ఏర్పడడం లాంటి లక్షణాలు కూడా గుండె జబ్బులు రావడానికి ముందస్తు సూచన. చిన్న పని చేసిన చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం,ఊరికే అలసటగా అనిపించడం, చెమట ఎక్కువగా పట్టడం కూడా హార్ట్ ఎటాక్ సంకేతమే.అలాగే చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వారికి కూడా గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.అలాగే మనసంతా బాధగా ఉండడం,ఎప్పుడు ఎదో ఒక ఆలోచనతో గందరగోళంగా ఉన్నట్లు భావించడం ఇవన్నీ హార్ట్ ఎటాక్ లక్షణాలు అని చెప్పవచ్చు. ఈ సూచనలు అన్ని ఇప్పటివరకు హార్ట్ ఎటాక్ వచ్చిన చాలామంది మహిళల్లో కనిపించిన లక్షణాలు గా చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి పై లక్షణాలు కనుక మీలో ఉంటే  ఓసారి డాక్టర్ ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించడం మంచిది





మరింత సమాచారం తెలుసుకోండి: