పచ్చి మామిడి.. వీటి పేరు వినగానే అందరి కి ఏదో అనుభూతి కలుగుతుంది.. అంతేకాదు వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మంది కి తెలియదు.. పుల్లగా ఉన్న ఈ మామిడి లో ఎంతో ఆరోగ్యం ఉందని నిపుణులు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పచ్చి మామిడి కాయ ఉపయోగ పడుతుంది. ఇది నీటి శాతాన్ని కూడా పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ కి కూడా బాగా ఉపయోగ పడుతుంది.

ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవడానికి పచ్చిమామిడి కాయలు తీసుకోండి.. కాస్తా నల్ల ఉప్పు వేసుకొని తీసుకుంటే ఇంకా మంచిదట. పచ్చి మామిడి కాయ లో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి అదే విధంగా క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్ కూడా దీని ద్వారా మనకి లభిస్తుంది.

ట్యాబ్లేట్స్ కన్నా వీటిని రోజు తీసుకోవడం మేలు. కరోనా సెకండ్ వేవ్ జనాల ను విపరీతం గా బాధిస్తుంది. అందుకే వీటికి ఎక్కువ . ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో డిమాండ్ కూడా పెరిగింది. షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడాని కి కూడా పచ్చి మామిడి కాయ బాగా ఉపయోగ పడుతుంది.  అంతే కాదండి ఐరన్ కూడా మనకి వస్తుంది.ఎసిడిటి సమస్యల తో బాధ పడే వారు పచ్చి మామిడి కాయ ముక్కల మీద బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గి పోతాయి. బరువు తగ్గడాని కి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది ప్రతి రోజూ 100 నుండి 150 గ్రాముల వరకు పచ్చి మామిడి కాయను తీసుకోవచ్చు. చూసారుగా పుల్లని పచ్చి మామిడి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి మీరు కూడా మామిడి ని తీసుకోండి.. కరోనా లాంటి మహమ్మారి నుంచి కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: