మ‌న‌దేశం జ‌నాభాలో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది. మ‌రి ఆ స్థాయిలో జ‌నాభాను కంటున్నారు. కానీ ఇదంతా ఇప్పుడు ఛేంజ్ అవుతోంది. ఎందుకంటే మ‌న దేశ యువ‌కుల్లో వీర్యం చాలా వీక్‌గా త‌యార‌వుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అగస్త్య స్పెర్మ్‌ బ్యాంకుకు వ‌చ్చే వంద‌మందిలో 70% మంది యువకుల వీర్యంలో శుక్ర‌క‌ణాలు చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయి. వీర్యం నాణ్య‌త చాలా వ‌ర‌కు తగ్గింది.

ఈ మ‌ధ్య కాలంలో యువ‌కుల్లో ఈ స‌మ‌స్య చాలా ఎక్కువైంది. ఈ సమస్య చాలా ప్రమాదకరంగా మారుతోంద‌ని వైద్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక అటు మహిళల్లో గర్భస్రావాలు పెరగుతుండ‌టం గ‌మ‌నార్హం. మారుతున్న జీవన శైలి, రసాయన ఎరువుల కారణంగా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు చాలా దెబ్బతింటున్నాయ‌ని స‌మ‌చారం. 1979 నుంచి 2016 మధ్య సీఎస్‌ఐఆర్ అనే సంస్థ 13వేల మంది మ‌గ‌వారిమీద అధ్యయనం నిర్వహించింది ఫ‌లితాలు వెల్ల‌డించింది.

కాగా ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో ఈ మధ్య కాలంలో శుక్రకణాల సంఖ్య 26 శాతం తగ్గిందని రిపోర్టు చెబుతోంది. 1979లో ఒక్క మిల్లీ లీటర్‌ వీర్యంలో సగటున 8.7 కోట్ల శుక్రకణాలు ఉండేవ‌ని చెబుతున్నారు. కాగా ఈ సంఖ్య గా 2016కు వ‌చ్చే స‌రికి 6.4 కోట్లకు త‌గ్గింది. చాలా మందిలో డబ్ల్యూహెచ్‌వో సూచించిన చాల త‌క్కువ సంఖ్‌య 1.5 కోట్ల కంటే దిగువ‌కు పడిపోవడం తీవ్ర ఆందోళన గురి చేస్తోంది.

వీర్యం ప‌రిమాణం కూడా చాలా వ‌ర‌కు త‌గ్గిపోతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారలో 25 నుంచి 30శాతం మంది మ‌న ఇండియ‌న్లు కావ‌డం బాధాక‌రం. ఇక అటు మహిళల్లోనూ ఈ సమస్య ఉంది. ఆడపిల్లల్లో చాలా వ‌ర‌కు నెలసరి సక్రమంగా ఉండట్లేద‌ని తెలింది. ఇండియాలో ఏడాదికి దాదాపు 10 నుంచి 20 శాతం గర్భస్రావాలు జరుగుతున్నాయని ఓ అధ్య‌య‌నంలో తేలింది. మారుతున్న జీవనవిధానంనే ఇందుకు గ‌ల కార‌ణం.

మరింత సమాచారం తెలుసుకోండి: