ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు ఎంత‌గా ప్ర‌భావం చూపుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప‌రిస్థితుల్లో ర‌క్తం నిల్వ‌లు విప‌రీతంగా త‌గ్గిపోతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడేందుకు రక్తం కావాల‌ని ఎంతోమంది రిక్వెస్టులు పంపుతున్నారు. గాయ‌ప‌డ్డ ఎవ‌రి ప్రాణం కాపాడాల‌న్నా శరీరంలో రక్తం ఉండ‌క త‌ప్ప‌దు. ఇక ఎమర్జెన్సీ కేసులలో  రక్తం అనేది లేక‌పోతే కాపాడ‌టం క‌ష్టం.

అయితే ఈ ర‌క్తం విలువ‌ను చెప్పేందుకు జూన్ 14 న ప్రపంచ రక్త దాన దినోత్సవంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున రక్తం విశేష‌ల‌ను తెలుపుతుంది. కాగా ఈ క‌రోనా సమయంలో పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపరచడంలో రక్తం చాలా కీల‌క‌మైంది. ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా ఆయా దేశాల్లో చాలామంది రక్తదానం చేసేందుకు ముందుకు రావ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. అయితే రక్తదాన దినోత్సవం, అందుకు ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం.

అసలు ఈరోజే వరల్డ్ బ్లడ్ డోనార్ డేను ఎందుకు చేసుకుంటామంటే జూన్ 14నే కార్ల్ లాండ్‌స్టీనర్ అనే వ్య‌క్తి పుట్టాడు. ఆయ‌న జన్మదినాన్ని ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణ‌యం మేర‌కు జ‌ర‌పుకుంటున్నాం. ఇంతకీ ఈ కార్ల్ లాండ్‌స్టీనర్ ఎవరంటే.. ప్రస్తుతం మన రక్తం ఫలానా గ్రూప్ అని చెప్తాం. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అని మ‌న ర‌క్తాన్ని విభజించింది కార్ల్ లాండ్‌స్టీనర్ కాబ‌ట్టి ఆయ‌న గుర్తుగా జ‌ర‌పుకుంటున్నాం.

1900 లో కార్ల్ లాండ్‌స్టీనర్ ప‌రీక్ష‌లు జ‌రిపి రక్తంకు గ్రూపులను కేటాయించారు. దాంతో ఏ మనిషికి ఏ గ్రూపు రక్తం కావాలో దానికి అవ‌స‌రం ప్ర‌కారం ఆ గ్రూప్ రక్తం ఇవ్వడం ప‌రిపాటిగా మారింది. ఇందుకు ఆయ‌న‌కు 1930లో నోబెల్ పురస్కారం ల‌భించింది. ఇక జూన్ 14న అంతర్జాతీయ రెడ్ క్రాస్ తో పాటు రెడ్ క్రెసెంట్ సొసైటీలు రక్తం ఎంత అవ‌స‌ర‌మో మనకు వివ‌రిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: