బిడ్డను తొమ్మిది నెలలు అమ్మ కడుపులో మోస్తుంది. నాన్న మాత్రం బిడ్డ ప్రయోజకుడు అయ్యేదాకా మోస్తాడు. అమ్మ గోరు ముద్దలు తినిపిస్తే.. నాన్న ప్రపంచం అంటే ఎంటో పరిచయం చేస్తాడు. అమ్మ గారాభం చేస్తే.. నాన్న జీవితం అంటే ఏంటో చెబుతాడు. నాన్న బతకడం అంటే ఎలానో, బాధ్యతలంటే ఏంటో చెబుతాడు. అందుకే అమ్మతో ఉన్నంత చనువుగా నాన్నతో ఉండలేరు. నాన్న జీవితంలో అన్ని చూసి, తన బిడ్డకు తన కష్టాలు రాకూడదని కోరుకుంటాడు.

అందుకే ఆయన కొంచెం గంభీరంగా ఉంటాడు. ప్రతీ పిల్లాడి జీవితంలో వాళ్లకు తొలి సూపర్ హీరో వాళ్ల నాన్నే. పిల్లల అవసరాలు తీర్చడంలో, వారికి కావలసినవి సమకూర్చడంలో నాన్న ఎప్పుడూ ముందు వరసులో ఉంటారు. నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి నాన్నకు ఒక రోజు ఉండాలని జూన్ నెల మూడో ఆదివారాన్ని మనం ప్రతీ ఏటా ఫాదర్స్ డేగా జరుపుకుంటాం.
ఎలా మొదలైందంటే..

ఈ ఫాదర్స్ డే సంస్కృతి యూరప్, అమెరికాల్లో మొదలైంది. సోనోరా స్మార్ట్ డోడ్డ్ అనే యువ‌తి మొద‌ట‌గా ఫాద‌ర్స్ డే సెల‌బ్రేట్ చేసుకుంద‌ని తెలుస్తోంది. ఆమె టీనేజ్‌లో ఉండ‌గానే త‌ల్లి చ‌నిపోయింది. అప్ప‌టి నుంచి తండ్రి విలియం జాక్స‌న్‌తో క‌లిసి త‌న 5 గురు తమ్ముళ్ల‌ను పెంచుతుంది. త‌మ కోసం త‌మ తండ్రి చేస్తున్న త్యాగాన్ని, నిర్వ‌ర్తిస్తున్న బాధ్య‌త‌ల‌ను గౌర‌వించ‌డానికి ఫాద‌ర్స్‌డేని ఆమె మొద‌ట స్టార్ చేసింది. ఆయ‌న పుట్టిన రోజు జూన్ 5న ఫాద‌ర్స్ డే గా  సెల‌బ్రేట్ చేసింది.

ఆమె త‌న తండ్రికి ఇచ్చిన గౌర‌వాన్ని ప్ర‌పంచం అంతా యాక్సెప్ట్ చేసింది. అప్ప‌టి నుంచి ప్ర‌తీ యేటా జూన్ మొద‌టి ఆదివారాన్ని ఫాద‌ర్స్ డేగా నిర్వ‌హించుకుంటున్నాం. యూర‌ప్‌, అమెరికా నుంచి మొద‌లై ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ ఈ సంస్కృతి విస్త‌రించింది. మ‌న ఇండియాలో కూడా ఫాద‌ర్స్ డేను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తుంది. ప్ర‌తీ యేటా ఫాద‌ర్స్ డే ఇక్క‌డి చిన్నారులు గ్రాండ్ గా నిర్వ‌హిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో కూడా ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదండీ ఫాద‌ర్స్ గురించి స్టోరీ. బాగుంది క‌దా.. వెంట‌నే మీ నాన్న‌కు కూడా శుభాకాంక్ష‌లు చెప్పండి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: