ఆడవాళ్లకు ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. అందులోను బంగారు ఆభరణాలు అంటే తెగ ఇష్ట పడతారు. వివిధ రకాల మోడల్స్ లో, సరికొత్త మెరుగులతో మనకు బంగారం లభిస్తుంది. అయితే మీరు ఎప్పుడన్నా ఈ విషయాలను గమనించారా.అదేనండి కొంతమంది జాతకరీత్యానో, గ్రహాల బలం కోసమో లేక మరే కారణం చేతనో కొన్ని రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు కదా.. అలాగే మీకు ఏడు వారాల నగల గురించి తెలుసా అసలు.ఏప్పుడన్నా విన్నారా వాటి గురించి.అప్పట్లో స్త్రీలు ఏడు వారాల నగలు ధరించే వారు. ఏడు వారాల నగలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో వారం ఒక్కో నగలు ధరించేవారట.ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసం బంగారు ఆభరణాలు ధరించేవారట. మరి అసలు ఏఏ రోజు ఏఏ నగలు ధరించేవారో ఈరోజు తెలుసుకుందాం.


 మొదటిగా ఆదివారం రోజున స్త్రీలు కెంపుకు సంబందించిన చెవి దిద్దులు, కెంపు రాళ్లతో పొదిగియున్న హారాలు వేసుకునేవారట. ఎందుకంటే ఆదివారం రోజున సూర్య బాగవుని కోసమని కెంపు రాళ్లు దరిచేవారట. సోమవారం రోజున చంద్రుని కోసం అని ముత్యాలు ఉన్న ముత్యాల హారాలు, ముత్యాల గాజులు వేసుకునే వారట. అలాగే మంగళవారం రోజున కుజుని కోసం పగడాలతో ఉన్న దండాలు, పగడాల ఉంగరాలు ధరించేవారు. అలాగే బుధవారం రోజున బుదిని కోసం అంటే బుధ గ్రహ అనుగ్రహం పొందటానికి పచ్చల పతకాలు, గాజులు వేసుకునెవారు.

గురువారం బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యా రాగము, చెవి దిద్దులు, గాజులు వేసుకునేవారు. శుక్రవారం రోజున శుక్రుని కోసం వజ్రాల హారాలు, వజ్రంతో చేసిన ముక్కు పుటకను ధరించేవారు. శనివారం రోజున శని కోసం నీలమణి హారాలు, గాజులు మొదలైన ఆభరణాలను స్త్రీలు ధరించేవారు. ఇలా ఈ ఏడు వరాలు ఏడు గ్రహాల అనుగ్రహం కోసం స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. ఏడు వారాల నగలు ధరించడం వలన ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని స్త్రీలు నమ్ముతారు. అలాగే గ్రహ దోష నివారణలు ఎమన్నా ఉంటే ఏడు వారాల నగలు వేసుకుంటే అన్నీ దోషాలు పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: