ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది బారెడు పొద్దేక్కే వరకూ నిద్ర పోతూనే వుంటారు. పని కారణంగానో లేక టీవీలు చూస్తూనో, సెల్ ఫోన్ చూస్తూనో కాలక్షేపం గడుపుతూ, రాత్రి పొద్దుపోయే వరకు మేలుకోవడం, ఉదయం ఎక్కువ సేపు నిద్రపోవడం లాంటివి ఇలా చేయడం వల్ల, ఆయుష్షు కూడా తక్కువ చేసుకుంటున్నారని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పూర్వం మన పెద్దవాళ్లు ఉదయం నాలుగున్నర నుంచి 5 గంటల లోపే నిద్రలేవడం, చన్నీటి స్నానం చేయడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేస్తున్నారు కాబట్టే అందుకే వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు.

కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచేటప్పుడు సూర్యోదయం కంటే, ముందుగానే లేవాలి అని , అప్పుడే మన పనులు త్వరగా ముగించుకోవడానికి వీలు ఉంటుందని , పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవడం వల్ల అదృష్టం వరిస్తుందని, అష్ట ఐశ్వర్యాలు చెంతకు  వస్తాయని పెద్ద వాళ్ళ నమ్మకం. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిపుణులు ఏం చెప్తున్నారు..ఏ సమయానికి నిద్ర లేస్తే మంచి జరుగుతుందో.. ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మనకు వరిస్తుంది అని, తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సవాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి లభించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు అట. కాబట్టి మీకు వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవడానికి ట్రై చెయ్యండి.ఆరోగ్యంగా జీవించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: