సువిశాలమైన భారతదేశంలో ప్రజల సంరక్షణ, శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అది వారి విధి. రాజ్యాంగం ప్రకారం శ్రేయోరాజ్య భావన కలిగి ఉన్న ప్రభుత్వాలు జనాలను ఆదుకునేందుకు, వారి అభివృద్ధికి కృషి చేయాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు రకరకాల కొత్త పథకాలను తెరమీదకు తీసుకొస్తుండటం, అమలు చేస్తుండటం మనం గమనించొచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా చాలా మేలు చేకూరుతుంది. అదే అటల్ పెన్షన్ యోజన. ఇది ముఖ్యంగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి పూర్తి భద్రతను అందిస్తుంది. ఈ స్కీమ్‌కు 18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న భారతీయులు అర్హులు. ఈ స్కీం విశేషాలపై స్పెషల్ స్టోరీ.

కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల కోసం కొన్ని పథకాలను స్పెషల్‌గా రూపొందిస్తుంది. అలాంటి స్పెషల్ స్కీమే ఈ అటల్ పెన్షన్ యోజన. ఈ యోజనలో డబ్బులు కట్టిన వారు ఉద్యోగ విరమణ తర్వాత హాయిగా జీవించొచ్చు. ఇక ఈ పథకంలో చేరిన వారు ప్రతీ నెల డబ్బులు కట్టాలి. అయితే, ఎంత కట్టాలి? అనేది మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా 18 ఏళ్ల నుంచి లేదా అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వారు మనీ పే చేయడం స్టార్ట్ చేస్తే 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కడుతూ రావాలి. ఈ స్కీమ్‌లో చేరిన కస్టమర్స్ వారి ఆధార్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్‌ను కలిగి ఉండాలి. అయితే, ఈ స్కీమ్‌లో డబ్బుల చెల్లింపులు దీర్ఘకాలిక వ్యాధి లేదా కస్టమర్ డెత్ జరిగిన సమయంలో తప్ప మరెప్పుడూ ఉండబోదని గుర్తించాలి. ఒకసారి డబ్బులు కట్టడం స్టార్ట్ చేశాక ముందస్తుగా ఈ స్కీమ్ నుంచి తప్పుకోవడం అస్సులు అనుమతింపబడదు. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల భార్యాభర్తలు తమ అటల్ పెన్షన్ యోజన ఖాతాల్లో నెలకు 577 రూపాయలు చెల్లించొచ్చు. ఈ దంపతులకు 35 ఏళ్లు నిండినట్లయితే, వారి అటల్ పెన్షన్ యోజన ఖాతాల్లో నెలవారీ సహకారం 902 రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు కష్టపడి డబ్బులు కడితే తర్వాత ఫ్యూచర్‌లో మంచి యూజ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: