దేశంలో మాదకద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. కేవలం యువతను లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే యువ రక్తంతో ఉరకలు వేస్తున్న భారత్ పై ఇలాంటి కుట్రలు లేవదీయడం ద్వారా యువతను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కొందరు అధికారుల స్వార్థం కోసం ఇవి దేశంలోకి వచ్చేస్తున్నాయి. అక్కడి నుండి యువతను చేరుతున్నాయి. నేడు పార్టీ కల్చర్ ఎక్కువ కావడంతో దానిని అడ్డుపెట్టుకొని కొన్ని కార్పొరేట్ సంస్థలు వివిధ కార్యాలయాలను(క్లబ్స్, పబ్స్ తదితర) ఏర్పాటు చేస్తున్నాయి. వీటి చాటున యువతను ఆకర్శించి తద్వారా వారికి మాదకద్రవ్యాల అలవాటు చేస్తున్నారు.

యువత కూడా తమపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయనేది కూడా గమనించుకోలేని స్థితిలో ఉండటం శోచనీయం. అసలు దేశం గురించి ఆలోచించే యువకులు రానురాను తగ్గిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగం పేరుతో విదేశాలకు  వెళ్ళామా, బాగా సంపాదించామా అనేది తప్ప మరో ఆలోచన లక్ష్యం నేటి యువతకు లేకపోవడం చాలా పెద్ద నష్టం. యువత ఎక్కువగా ఉన్న దేశంలో వారు వారి దేశం గురించి ఆలోచించి దాని అభివృద్ధికి కృషి చేస్తే లభించే ఫలితాలు వేరుగా ఉంటాయి. కానీ అలాంటి యువత చాలా తక్కువగా ఉండటంతో ఈ తరం తన బాధ్యతను తేలికగా తీసుకోని తమపై తాము పెద్ద మచ్చ తెచ్చుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

యువతకు ఏది మొదలు పెట్టాలి అన్నా కూడా దానికి పునాది పార్టీనే. ఈ పార్టీ కల్చర్ వలన మాదకద్రవ్యాల కు అతిసులభంగా అలవాటు పడుతున్నారు. దీనితో వీరి లక్ష్యాలు మారిపోతున్నాయి. ఒక్కసారి మాదకద్రవ్యాలకు బానిసలు అయ్యాక వాళ్ళు ఈజీ మనీ కోసం వెతుకులాట మొదలుపెడుతున్నారు. దీనితో నేరాలకు పాల్పడుతున్న యువత సంఖ్య రానురాను పెరిగిపోతుందని అధికారులు కూడా చెపుతున్నారు. అసలు దేశం పట్ల లక్ష్యం సాదించకపోగా, తమ లక్ష్యాలు సాధించలేక చివరికి నేర చరిత్ర తో మిగిలిపోతున్నారు. ఇదే శత్రు దేశాలకు కూడా కావాల్సింది, అందుకే నేటి యువతపై అనేక శక్తులు దేశం బయట నుండి లోపల నుండి పరోక్షంగా దాడులు చేస్తూనే ఉన్నారు. యువత నిర్వీర్యం కావడం లేదా చేయడం వారికి ఉన్న ప్రధాన లక్ష్యం. దీనిని భారత యువత ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా దేశం ముందుకు పోగలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: