భారతదేశంలో వైవాహిక బంధానికి ఒక ప్రాముఖ్యత ఉంది. దానిని అనేక దేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. ఇలాంటి ప్రాముఖ్యతలను చూసి చాలా దేశాలు భారత్ వైపు ఆకర్షితం అవుతున్నాయి. అందుకే అనేక మంది ఇక్కడకు వచ్చి భారత సంస్కృతీ, సాంప్రదాయాలను అలవర్చుకోవాలని తాపత్రయ పడుతుంటారు. మరి కొందరు వాళ్ళవాళ్ళ సొంత దేశాలు వదిలి ఇక్కడే ఉండిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ రోజులు మారుతున్నాయి, ఇక్కడ వారికీ పాశ్చాత్య సంస్కృతిపై అపారప్రేమ పెరిగిపోతుంది. దీనితో ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు పాతచింతకాయ పచ్చడి మాదిరి పనికిరావడం లేదు.

తాజాగా ఆంధ్రలోని అనంతపురం లో ని కామరూపల్లి గ్రామానికి చెందిన ఒక ఘటన దేశంలో సాంప్రదాయాల విలువలను మరోసారి గుర్తుకు తెస్తుంది. ఈ గ్రామంలో రైతు కుటుంబం ఒకటి ఉంది, అందులో ఇంటిపెద్దకు సంతానం లేకపోవడంతో వంశవృద్ధి కోసం ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఉన్న దానితో తృప్తి పడుతూ సేవా మార్గాన్ని ఎంచుకొని జీవిస్తున్నాడు ఆ రైతు. అయితే ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా అతడు మరణించాడు. ఉన్నదాంట్లో భర్తకు తమ గ్రామంలోనే ఒక ఘాట్ కట్టించారు భార్యలిద్దరు. అయితే బ్రతికి ఉండగా తాము భర్తతో కలిసి ఎలా ఉన్నామో మరణించిన అనంతరం కూడా అలాగే ఉండాలి అనిపించినట్టుగా ఉంది వాళ్ళ ఇరువురికి.  

ఆలోచన రావడమే మొదలు ఆ రైతుకు కట్టిన సమాధి పక్కనే తమకు రెండు సమాధులు కట్టించుకున్నారు ఆ ఇద్దరు భార్యలు. తమ వద్ద మిగిలిన సంపదతో భర్త చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాము మృతి చెందిన అనంతరం ఆ సమాధులలో తమను ఉంచాలని ఆఖరి కోరిక చెప్పుకున్నారు. ఇదంతా భర్త ప్రధమ వర్ధంతి సందర్భంగా వచ్చిన ఆలోచన. ఒక పక్క సేవా భావనతో ముందుకు వెళుతూ భర్త సమాధి పక్కనే తమకు స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ భార్యల గురించి అక్కడ సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పిల్లలు లేరని ఆగిపోకుండా, సమాజ సేవలో నిమగ్నమైన వీరు పలువురికి ఆదర్శప్రాయులు అనడంలో అతిశయోక్తి లేదు. అయినా భర్త సమాధి పక్కనే బ్రతికి ఉండగానే సమాధులు కట్టించుకోవడమ్ అనేది మాత్రం కాస్త విడ్డురంగానే ఉంది. ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా చుట్టూ ఉన్నవారికి అది చెప్పి, మరణం అనంతరం ఆ పని చేసి ఉంటె బాగుండేదేమో.. అలా పక్క వారిని శ్రమ పెట్టడం వారికి ఇష్టం లేదేమోలే!

మరింత సమాచారం తెలుసుకోండి: