మీరు ప్రకృతి ప్రేమికులు, సాహసాలను ఇష్టపడేవారు క్యాంపింగ్ ను బాగా ఇష్టపడతారు. భారతదేశంలో క్యాంపింగ్ అనేది ప్రకృతితో కనెక్ట్ కావడానికి ఉన్న బెస్ట్ దారులలో ఒకటి. శిబిరంలో ఉండి నక్షత్రాలను చూస్తూ గడిపే రాత్రి ఇచ్చే ఆనందం వేరు. ఇది మీకు హడావిడిగా ఉండే రొటీన్ లైఫ్ నుంచి మంచి బ్రేక్ ఇస్తుంది. అడ్వెంచర్ ఔత్సాహికులకు క్యాంపింగ్‌కి వెళ్ళడానికి ఇండియాలో గొప్ప ప్రదేశాలు చాలా ఉన్నాయి.

స్పితి లోయ, హిమాచల్ ప్రదేశ్
స్పితి లోయ హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలోని ఉత్తమ క్యాంపింగ్ ప్రదేశాలలో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి సాహస ప్రియులు, పర్వతారోహకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు కొండలు, అందమైన సరస్సులు, మఠాలు, పచ్చని లోయలు, ప్రకృతి ప్రత్యేక సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

హిమాచల్ ప్రదేశ్ లోని చంద్రతల్ సరస్సు  
అధిక ఎత్తులో ఉన్న చంద్రాతల్ సరస్సు హిమాచల్ ప్రదేశ్‌లో సహజమైన ప్రకృతిని సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. సముద్ర మట్టానికి దాదాపు 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న సరస్సు ఒడ్డుకు టెక్కింగ్ ద్వారా నడవవచ్చు. ఇది చంద్రుని సరస్సుగా ప్రసిద్ధి చెందింది. దాని అందం మిమ్మల్ని మైమరపిస్తుంది. ఇక్కడ క్యాంపింగ్ ఒక థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.

సోలాంగ్ వ్యాలీ, మనాలి
మనాలిలోని సోలాంగ్ వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. పచ్చని పచ్చదనం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఇక్కడ మీరు స్కీయింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్, రివర్ క్రాసింగ్, పారాగ్లైడింగ్, ATV రైడ్, జోర్బింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

త్సో మోరిరి, లడఖ్
ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి  లడఖ్‌లోని త్సో మోరిరి. మే నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ క్యాంప్ చేయడానికి ఉత్తమ సమయం. సూర్యోదయాన్ని చూడడం, ట్రెక్కింగ్‌కు వెళ్లడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి.

ముస్సూరీ, ఉత్తరాఖండ్
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రయాణ ప్రదేశాలలో ముస్సోరీ ఒకటి. ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి ప్రదేశం. పచ్చదనం, మంచుతో కప్పబడిన పర్వతాలు, ట్రెక్కింగ్, అందమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: