తక్కువ బడ్జెట్‌లో హిల్ స్టేషన్ల ట్రిప్ వేయాలనుకుంటున్నారా ? మీకు జైపూర్ కరెక్ట్. అక్కడ అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్ లేదా జల్ మహల్ వంటి అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ కు జైపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే జైపూర్ సమీపంలో ఉన్న హిల్ స్టేషన్‌ని సందర్శించవచ్చు. ఈ ట్రిప్ లో ఆహ్లాదకరమైన వాతావరణం అందమైన దృశ్యాలతో లక్షలాది జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. జైపూర్ సమీపంలోని హిల్ స్టేషన్లు వారాంతాల్లో సందర్శించడానికి గొప్ప ప్రదేశాలు. జైపూర్ సమీపంలో 6 ప్రసిద్ధ హిల్ స్టేషన్లు ఉన్నాయి.

మౌంట్ అబూ, రాజస్థాన్
మౌంట్ అబూ జైపూర్ సమీపంలో సందర్శించడానికి మంచి హిల్ స్టేషన్. మౌంట్ అబూ హిల్ స్టేషన్‌లో దేవాలయాలు ప్రధాన ఆకర్షణ. ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఆరావళి కొండలు సహజ సౌందర్యానికి, అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి. అలాగే కొన్ని బాలీవుడ్ సినిమాలను మౌంట్ అబూ వంటి మనోహరమైన ప్రదేశంలో చిత్రీకరించారు.

ధనౌల్తి, ఉత్తరాఖండ్
ధనౌల్తి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది జైపూర్ సమీపంలోని ఉత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. ఈ ప్రదేశం వాతావరణం ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. ఈ పట్టణ హడావిడి నుంచి బయటపడాలనుకుంటే ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేయవచ్చు.

కసౌలి, హిమాచల్ ప్రదేశ్
సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న కసౌలి, హిమాచల్ ప్రదేశ్ సమీపంలోని ప్రముఖ హిల్ స్టేషన్లలో ఒకటి. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లలో ఒకటి. విశ్రాంతి తీసుకోవడంతో పాటు మీరు ఇక్కడ అనేక సాహస కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.

నైనిటాల్, ఉత్తరాఖండ్
నైనిటాల్ ఉత్తరాఖండ్ లోని ఆకర్షణీయమైన హిల్ స్టేషన్. ఇది సహజ సౌందర్యం, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల దీనిని వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇది మాత్రమే కాదు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రసిద్ధ నాయిని సరస్సు ఈ ప్రదేశానికి ప్రధాన ఆకర్షణలు.

కుఫ్రి, హిమాచల్ ప్రదేశ్
కుఫ్రి ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. చుట్టూ ఉన్న హిమాలయ శ్రేణులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. లోయలో గొప్ప వృక్షజాలం, జంతుజాలం, దట్టమైన దేవదార్ అడవులు కూడా ఉన్నాయి. మీకు స్కీయింగ్, ట్రెక్కింగ్ అంటే ఇష్టం అయితే ఇది మీకు స్వర్గమే.

రణక్పూర్, రాజస్థాన్
రణక్పూర్ రాజస్థాన్ లోని మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్. దీనికి గొప్ప రాజపుత్ర రాజు రాణా కుంభ పేరు పెట్టారు. రణక్పూర్ ఒక జైన తీర్థయాత్ర కేంద్రంగా ఉంది. ఇక్కడ అద్భుతమైన పురాతన దేవాలయాలను చూడొచ్చు. అద్భుతమైన పురాతన సంస్కృతి, పచ్చని పచ్చదనం, కొండలు జైపూర్ సమీపంలో తప్పక చూడవలసిన హిల్ స్టేషన్లలో దీనిని ఒకటిగా నిలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: