రహస్యాలు, భయానక సంఘటనలు, వివరించలేని అనుభూతులను కల్పించే ప్రదేశాలు మన గ్రహంలో ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని సందర్శించే సాహసికులు చాలా తక్కువ. అలాంటి భయంకర ప్రదేశాలను సందర్శించే ఆలోచన, ఆసక్తి ఉంటే ఈ భయంకర ప్రదేశాలపై కూడా ఓ కన్నేయండి.

బాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్, కెనడా
కెనడాలో ఉన్న బాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ గురించి సాహసికులు తెలుసుకోవాలి. ఈ హోటల్ వివరించలేని రహస్యాలు, దెయ్యం కథలు, వింత సంఘటనలతో నిండి ఉంది. స్థానికుల ప్రకారం గది నంబర్ 873 లో ఒక కుటుంబం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేయబడింది. హోటల్ లో  ఇప్పుడు వారి ఆత్మలు ఉంటున్నాయి. చాలా మందికి అక్కడ ఒక ఆత్మ కన్పిస్తుందట. ఆ ఆత్మ సరిగ్గా గమనిస్తే వెంటనే గాలిలో అదృశ్యమవుతుందట.

స్టోన్‌హెంజ్, ఇంగ్లాండ్
స్టోన్‌హెంజ్ అనేది ఇంగ్లాండ్‌లో ఉన్న 5000 సంవత్సరాల పురాతన నిర్మాణం. దీని రహస్యం చాలా కాలంగా రహస్యంగానే ఉండిపోయింది. ఇది భారీ రాళ్ల సమూహం. ఇది ప్రత్యేకమైన బ్లూస్టోన్ పదార్థంతో తయారు చేయబడింది. ఈ ప్రత్యేకమైన బ్లూస్టోన్ వేల్స్‌లో 322 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంబ్రోకేషైర్‌లోని ప్రెస్లీ హిల్స్‌లో మాత్రమే కనిపిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే అంత భారీ రాళ్లను ఎలా రవాణా చేశారు? ఎవరు చేశారు? వాటి తయారీ వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఎవ్వరికి తెలియదు.

డెవిల్స్ బ్రిడ్జ్, జర్మనీ
ప్రపంచంలోని అత్యంత రెండవ ప్రపంచ కళాఖండాలలో ఒకటి రాకోట్జ్‌ బ్రూక్ లేదా డెవిల్స్ బ్రిడ్జ్. అందమైన క్రామ్‌ లాయర్ పార్క్‌లో ఉన్న ఈ సెమీ సర్కిల్ వంతెన చాలా అందంగా ఉంటుంది. ప్రజలు దీనిని డెవిల్ స్వయంగా నిర్మించిందని చెప్తారు. అందుకే దీనికి అలాంటి పేరు ఉంది. ఇంకా ఈ బ్రిడ్జ్ పై అనేక అతీంద్రియ సంఘటనలు చోటు చేసుకున్నాయట. ఇలాంటి అద్భుతమైన, భయంకరమైన, అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: