కరోనా మహమ్మారి వచ్చాక ప్రపంచంలో చాలా మారిపోయింది. అందులో ముఖ్యమైంది వర్క్ ఫ్రమ్ హోమ్. మహమ్మారి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచే పని చేయడం ప్రారంభించారు. నిజానికి ఇలాంటి అవకాశం వస్తుందని ఎవరూ అనుకోలేదు.పైగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. చాలా ఐటి దిగ్గజాలు తమ ఉద్యోగులను శాశ్వతంగా ఇంట్లో కూర్చునే పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అలాంటి వారు ప్రకృతిని ఆస్వాదిస్తూనే పని చేసుకోవడానికి 5 అద్భుతమైన ప్రదేశాలు మీకోసం.

ముస్సోరీ, ఉత్తరాఖండ్
ముస్సోరీని హిల్ స్టేషన్ల రాణిగా పిలుస్తారు. ముస్సోరీని 2015 లో ఉచిత వైఫై నగరంగా ప్రకటించారు. ఇది రిమోట్‌గా పని చేయడానికి అత్యంత ఆసక్తి ఉన్న ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ నగరం హిమాలయ పర్వతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పని చేయడానికి వీలు కల్పిస్తుంది.

జిభి, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ కొండల రాష్ట్రంగా పిలువబడుతుంది.  మీరు ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే జిభి ఒక ఆదర్శవంతమైన ఎంపిక. హిమాచల్ ప్రదేశ్‌లో దాగి ఉన్న రత్నం జిభి. పని చేసుకుంటూ హిమాలయాల పచ్చని కొండల ప్రశాంతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

షిల్లాంగ్, మేఘాలయ
ఈశాన్య భారతదేశంలో షిల్లాంగ్ సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. దేశంలోని ఈశాన్య ప్రాంతాలను అన్వేషించాలనుకునే నిపుణులకు షిల్లాంగ్ అనువైన గమ్యస్థానం. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతతతో ఉండే ఈ వింతైన హిల్ స్టేషన్ ను తూర్పు స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు

వర్కాల, కేరళ
మీరు కూడా బీచ్ ప్రేమికులైతే...  బీచ్‌లో చక్కటి దృశ్యం, అలల ఉధృతి మధ్య ప్రశాంతంగా పని చేయాలి అనుకునే వారికి సరైన ప్రదేశం. అరేబియా సముద్రం ముత్యంగా పిలువబడే ఇది నీటి క్రీడా కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది.

మసినగుడి, తమిళనాడు
వన్యప్రాణి ప్రేమికులకు ఆనందం కలిగించే మసీనాగుడి చుట్టూ ప్రకృతి అందం ఉంటుంది.  వైల్డ్‌లైఫ్ హోమ్‌స్టేలు ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్. వీటిలో చాలా హోమ్‌స్టేలు వేగవంతమైన ఇంటర్నెట్ ను అందిస్తున్నాయి. ప్రకృతి, వన్యప్రాణులతో కనెక్ట్ కావాలనుకునే వారికి ఇఇ అద్భుతమైన ప్లేస్.

మరింత సమాచారం తెలుసుకోండి: