రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న అమెరికా మెరైన్ లో సరికొత్త విషయం జరిగింది. ఈ దళంలో చేరిన సిక్కు యువకుడు తన సాంప్రదాయం లో భాగమైన తలపాగా విధులలో ధరించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేయడంతో మొదలైంది ఈ విషయం. ఆ యువకుడు తన హక్కుల కోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్ట్ యువకుడి కి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనితో భారీ చరిత్ర ఉన్న అమెరికా మెరైన్ మొదటి సారి నిబంధనలను మార్చాల్సి వచ్చింది. సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే తొలిసారి. 2017లో విద్యాబ్యాసం పూర్తికాగానే సుఖఃభీర్ సింగ్ మెరైన్ లో చేరాడు.

అయితే తన విధులు నిర్వహించే సమయంలో సాధారణంగా సిక్కులు ధరించే తలపాగా ధరించడానికి అక్కడి ఉన్నత అధికారులు నిరాకరించారు. దీనితో ఆయన మతపరమైన  వెసులుబాటు కల్పించకుంటే కోర్టుకు వెళ్తానని అధికారులతో చెప్పాడు. కానీ వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించడం సరికాదని నచ్చజెప్పారు. కానీ తలపాగా పై ఆయన పట్టు వీడకుండా కోర్ట్  ను ఆశ్రయించాడు. అయితే అధికారులు కూడా దానికి సరైన కారణాన్ని వెల్లడించారు. సాధారణ ప్రాంతాలలో విధులు నిర్వహించే సమయంలో తలపాగా ధరించవచ్చునని, కానీ కొన్ని సున్నిత ప్రాంతాలలో పాగా గుర్తుపట్టి కొందరు దాడికి దిగే అవకాశాలు ఉన్నందున తాము నిబంధన పెట్టినట్టు స్పష్టం చేశారు.

తొలుత లెఫ్టినెంట్ గా విధులు నిర్వహించిన సుఖఃబీర్ సింగ్ అనంతరం కెప్టెన్ గా పదోన్నతి పొందనున్నారు. అప్పుడు తాను తలపాగాపై పోరాటం చేసితీరుతానని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. భారత్ నుండి వలస వచ్చిన సుఖఃబీర్ సింగ్ కు సాధారణ విధులలో తలపాగా ధరించే అవకాశం కల్పించారు అధికారులు. ఇక యుద్ధ విధులలో ఉన్నప్పుడు ఏక రూపకత ఉండటం చాలా అవసరం అని అందువలననే మెరైన్ ఉన్నతాధికారులు సుఖఃబీర్ సింగ్ విన్నపాన్ని తిరస్కరించారని ఆ పత్రిక పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లలో సిక్కులు 100 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరందరికి తలపాగా ధరించేందుకు, జుట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: