మనిషి మెదడు గురించి ఎన్ని ప్రయోగాలు జరిగిన దానిలో ఏమి ఉందొ కనుక్కోవడం మాత్రం ఇంతవరకు ఎవరికి సాధ్యపడలేదు. ఒకరి ఆలోచన మరొకరికి రాదు, ఒకరు చేసిన ఆలోచన మరొకరికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇలా జరగటానికి వారిలో ఉండే ఉత్సాహపూరితమైన ఆలోచనలే కారణం అంటున్నారు నిపుణులు. కేవలం సమస్యలను చూసే బయపడేవాళ్లు కొందరు అయితే ఆ సమస్యలలోనే అవకాశాలను వెతుక్కునే వాళ్ళు మరికొందరు. ఇలా అనేక పరిస్థితులలో అనేక విధాలుగా ఆలోచిస్తున్న వారి అందరికి అదే బుర్ర, అయినా ఆలోచించే తీరులో గొప్ప తేడా కనిపిస్తూనే ఉంది.

కరోనా సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అందరు భయపడితే కొందరు మాత్రం దానిలో కూడా బ్రతుకుదెరువు వెతుక్కున్నారు. అలాంటి వారిలో చాలా మంది అప్పటికి కూడా తినడానికి లేనివారు. అందుకే బ్రతకాలి అనే తీవ్రమైన కోరిక నుండి వారికి బ్రతుకు దెరువు కనిపించింది. ఒక్కసారి దానికోసం అడుగు  ముందుకు వేస్తె అదే నీకోసం దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ముందు నువ్వు అడుగు వేయగలుగుతున్నావా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. అలా అడుగు వేసిన వారు ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు.  

తాజాగా కరోనా సమయంలో తిండి దొరకడానికి కూడా కష్టపడిన ఒక కుటుంబం కోసం ఆ ఇంటి పెద్ద ఒక ఆలోచనను చేశాడు. ఎలా ఉంటుందో భార్యతో పంచుకున్నాడు, ఆమె కూడా సరే ప్రయత్నించు అనగానే మొదలు పెట్టాడు, ఇప్పటికి అదే జీవనాధారంగా బ్రతికేస్తున్నాడు. ఇంతకీ అతను ఎంచుకున్న దారి ఏమంటే, వివిధ వేషాలు వేసుకుని పిల్లలను భయపెట్టడం. ఇది కరోనా సమయంలో చాలా ఉపకరించింది అక్కడ ఉన్న తల్లిదండ్రులకు. అందుకే అతడిని తమ ఇంటికి కూడా పిలిపించుకొని మరి పిల్లలను భయపెట్టాలని ప్రత్యేకంగా పిలవడం మొదలు పెట్టారు.  దానితో ఇంకాస్త సంపాదన పెరిగింది. ఇలా రోజు ఆయన ఇప్పటికి కూడా 20 ఇళ్లలో ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ తన జీవితాన్ని కొసంగిస్తు న్నాడు. అయితే ఇప్పుడు కాస్త ధర నిర్ణయించడం ఆయనే చేస్తూ ప్రతి ఇంటికి 30 డాలర్లు వాసులు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: