కోవిడ్ -19 మహమ్మారి చాలా మందిని సుదూర ప్రాంతాలకు వెళ్లడం గురించి ఆలోచించేలా చేసింది. అలాంటి వ్యక్తుల అవసరాలను తీర్చడానికి, ప్రజలు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, పట్టణాలు, నగరాలు ప్రత్యేకమైన ఆఫర్‌లతో ముందుకు వచ్చాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, లేదా విదేశాలలో స్థిరపడాలనుకుంటే కొన్ని దేశాలు చాలా వరకు సహాయం చేస్తున్నాయి. వ్యాపారం ప్రారంభించడానికి అక్కడకు వెళ్లే వ్యక్తులకు కొన్ని ప్రదేశాలు ఆర్థిక సాయం అందిస్తుండగా, మరికొన్నింటిని అలాంటి వారికి పునరుద్ధరణ కోసం తమ ఇళ్లను విక్రయిస్తున్నాయి. అక్కడ నివసిస్తే దాదాపు 24 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని దేశాలు.

స్పెయిన్
ఆస్టూరియాస్ ప్రావిన్స్ ప్రాంతంలోని స్పెయిన్ లో ఉన్న పొంగా నగరంలో స్థిరపడిన ప్రతి శిశువుకు అదనంగా 3000 డాలర్లతో పాటు స్థిరపడటానికి వారికి 3000 డాలర్ల వరకు ఆఫర్ చేస్తోంది. అంతే కాదు రూబియా నగరం వారి ఆదాయాన్ని భర్తీ చేయడానికి, అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారికి మరింత ఆఫర్ చేస్తుంది.

స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌కు మారడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ ఒక మంచి అవకాశం ఉంది. స్విట్జర్లాండ్ అల్బినెన్ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. నగర జనాభాను పెంచడానికి 45 ఏళ్లలోపు వలస దారులకు అక్కడికి వెళ్లడానికి $ 25,200 అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ని అంగీకరించాలనుకునే వారు 10 సంవత్సరాలు దేశంలో ఉండడానికి కట్టుబడి ఉండాలి. అంతే కాకుండా మీరు స్విట్జర్లాండ్ నివాసి అయి ఉండాలి లేదా స్విస్ నివాసిని వివాహం చేసుకోవాలి.

ఇటలీ
ఇటలీలో సార్డిన, సిసిలీ, మిలానో అండ్ అబ్రుజో వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఊహించని ధరలకు ఇళ్లను విక్రయిస్తున్నారు. కాబట్టి మీరు ఇటలీకి వెళ్లాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు తక్కువ ధరకే ఇల్లు బదిలీ చేయడానికి, కొనుగోలు చేయడానికి ఇంకా ఆఫర్లు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా సరైన సమయ వ్యవధిలో మీ స్వంత ఖర్చులతో వారి ఇళ్లను పునరుద్ధరించడం.

చిలీ
మీరు వ్యాపారవేత్తగా ఉండి, వ్యాపారం ప్రారంభించాలనుకుంటే చిలీకి వెళ్లినప్పుడు మీ కంపెనీని ప్రారంభించడానికి అదనపు సహాయం పొందవచ్చు. వర్క్‌షాప్‌లు, పిచ్ ట్రైనింగ్, మకాం మార్చాలనుకునే వారికి మార్గదర్శకత్వం అందించడంతో పాటుగా 25 మిలియన్ల పెసోలు అందించే కార్యక్రమం ద్వారా స్టార్ట్-అప్ చిలీ సంవత్సరాలుగా ప్రారంభ స్థాయి పారిశ్రామికవేత్తలకు సహాయపడుతోందని నివేదికలు పేర్కొన్నాయి. దీని కోసం చిలీ కోసం ఆరు నెలల కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇంకా ఆఫర్‌లో దరఖాస్తుదారులు ఒక సంవత్సరం వర్క్ వీసాను కూడా పొందుతారు. తద్వారా వారు చిలీ నుండి తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఒక స్థలాన్ని పొందవచ్చు.

మారిషస్
వ్యాపారం ప్రారంభించడానికి మీరు అక్కడికి వెళితే ఈ గమ్యం దాదాపు 20000 మారిషస్ రూపాయలను అందిస్తోంది. చేయాల్సిందల్లా ఒక కమిటీకి లాభదాయకమైన, ప్రత్యేకమైన వ్యాపార ఆలోచనను అందించడం.

ఐర్లాండ్
మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఐర్లాండ్ అనువైన ప్రదేశం. నివేదికల ప్రకారం ఎంటర్‌ప్రైజ్ ఐర్లాండ్ కొత్త వ్యాపారాలకు మద్దతు ఇచ్చే పథకం. ప్రారంభ వ్యాపారాలకు 120 మిలియన్లను కూడా అందించింది. దరఖాస్తు చేయడానికి మీరు ఐరిష్ కానవసరం లేదు. కానీ మీరు మీ వ్యాపారాన్ని ఐర్లాండ్‌లో నమోదు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: