పరువు హత్యలు భారతదేశంలోనే అనుకుంటున్నారు అందరు. అవి సమాజానికి, వ్యక్తికి సంబందించినవి కాబట్టి ఒక్క దేశానికి పరిమితం కావు. కాకపోతే ఇతర దేశాలలో జరిగేవి మానవరకు రావు కాబట్టి ఇవన్నీ మనవద్ద మాత్రమే జరుగుతాయి అని అనుకుంటాము. కానీ సమాజం అంటూ ఉన్న ప్రతి చోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటి పరిస్థితులలో అయితే ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఇలాంటి ఘటనలు జరిగితే దాదాపుగా అవి కుల, మత ద్వేషాలను రగిలించడానికి చూసే ఉన్మత్త వాదులకు సరైన సందర్భాలు అవుతాయి. ఇప్పుడు ప్రపంచంలో అలాంటివి జరగాలి అనుకునే వారి సంఖ్య పెరిగిని. అంటే తాలిబన్ లు పరోక్షంగా ప్రపంచాన్ని ముక్కలు చేసి, లాభపడదాం అనుకుంటున్న రోజులు ఇవి, ఇప్పుడు ఇలాంటివాటికి తావు ఇవ్వకుండా ఉంటేనే మేలు.

ఇప్పటి వరకు పరువు హత్యలు భారత్ లో చూసి నివ్వెరపోయింది వారందరు, అవన్నీ మన దేశంలో మాత్రమే జరుగుతాయని అనుకునేవారు. కానీ తాజాగా పాకిస్తాన్ లో కూడా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని తగలబెట్టేశారు. దానికి కారణం కూడా ప్రేమ వ్యవహారమే. ఇద్దరు వేర్వేరు మతాల వారు వివాహానికి పూనుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం ఇదంతా నచ్చక, తమ తోటివారిని అందరిని ఒక్కచోట చేర్చి తలగలబెట్టేశారు. అంటే మనదేశంలోనే కాదు అన్ని  జరుగుతున్నాయిలే అని విశ్రాంతిగా ఆలోచించడం కాదు ఈ ఘటన సందర్భాన్ని ఇక్కడ ప్రతిపాదించడం వెనుక అసలు కారణం, ఇవన్నీ సమాజానికి సంబందించినవి, ప్రతి కులం, మతం లాంటివి ఉన్నంతకాలం ఇవన్నీ జరగాలని కాదు, ఎక్కడో ఉంటారు కొందరు మూర్ఖులు వాళ్ళ వలన ఇవన్నీ తప్పవు.

సమాజంతో ముడిపడిన వాటిని వ్యక్తులతో, వ్యక్తులతో ముడిపడిన వాటిని సమాజంతో ముడిపెట్టి చూస్తే అవి సరిగా అర్ధం కావు. ఒక పరిస్థితిని సరిగ్గా అర్ధం చేసుకున్నప్పుడే దానిని మూలాలు తెలుస్తాయి, అప్పుడే అలాంటి మూలాల జోలికి లేదా అటువంటి పరిస్థితులలోకి మనం జారిపోకుండా మనల్ని మనం హెచ్చరించుకుంటూ, సరిచేసుకోవడం జరుగుతుంది. అలా వ్యక్తిలో మార్పులు వస్తే, సమాజం అదే మారిపోతుంది. ఎందుకంటే, సమాజం అంటే వ్యక్తుల సమూహమే కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: