ఇంధనం వాడకం బాగా పెరిగిపోతుండటంతో గాలిలో స్వచ్ఛత తగ్గుతూ వస్తుంది. ఎక్కువ శాతం కర్బనం గాలిలో కలిసి అది అనారోగ్యానికి కారణం అవుతుందని ప్రభుత్వాలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇంధన వాడకం తగ్గించేస్తు, విద్యుత్ వాహనాల వాడకాన్ని ఆయా దేశాలు పెంచేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇంకా ఈ తరహా మార్పులు కొద్దిశాతం మాత్రమే రావడంతో పూర్తిగా తెచ్చేందుకు ప్రభుత్వాలు ఆయా వాహనాల ఏర్పాటు తో పాటుగా సొంత వాహనాలు వాడే వారికి సరికొత్త నిబంధనలు కూడా విధిస్తున్నారు. తద్వారా సొంత వాహనాలు వాడకం తగ్గటం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుందనేది ప్రభుత్వం ఆలోచన.

ఆలోచన బాగానే ఉన్నప్పటికీ అది కొన్నాళ్ళు అనుసరించినా మళ్ళీ కొన్నాళ్ళకు పరిస్థితి యాధస్థితికి వస్తూనే ఉంటుంది. ఇది సమాజంలో అలవాటు అయిపోయింది. దానిని కూడా మార్చేందుకు ప్రభుత్వాలు కఠిన మైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ లో పెట్రోల్, డీజిల్ ఇంధనంగా వాడే వాహనాలను రోడ్లపైకి తెస్తే భారీగా పన్నులు లేదా జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం కఠినంగా స్పష్టం చేసింది. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా పేరుగాంచిన లండన్ లోనే కాలుష్య కోరలు చాచుకున్నప్రాంతాలు ఉన్నాయని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనితో కఠిన మైన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని చెప్తుంది.

లండన్లోనే కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ఇకమీదట పొగ వచ్చే వాహనాలు వాడితే పన్ను కట్టాల్సిందేనట. అంటే ఆయా ప్రాంతాలలో ఇక విద్యుత్ వాహనాలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. కాదని ఎవరైనా పొగ వాహనాలు తీసుకుని రోడ్డుపైకి వస్తే, పన్నుగా 12.5 పౌండ్లు  కట్టాల్సిందే. మిగిలిన ప్రాంతాలలో కూడా పెట్రోల్ వాహనాలు యూరో స్టేజి 4, డీజిల్ వాహనాలు 6 మించకుండా ఉండాలని నిబంధన పెట్టారు. అవి కూడా పాతవాహనాలు రోడ్డుపై కనిపించకూడదట.  ఇప్పటికే ఈ తరహా పన్ను బైకులు, స్కూటర్లపై ఉందట. తాజాగా ఫోర్ వీలర్ లపై కూడా విధిస్తున్నారు.  ప్రజలు మాత్రం దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పని మీద అనేక చోట్లకు వెళ్తుంటాం, అలా అనుకోకుండా ఆల్ట్రనేట్ రూట్ లోకి వస్తే వెంటనే పన్ను కట్టించుకుంటున్నారని కొందరు అసంతృపి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: