భూమిపై 3 శాతమే త్రాగునీరు ఉంది. అందులో కూడా మంచు రూపంలో మనిషికి పనికిరాని స్థితిలో 2 శాతం ఉండగా, మిగిలింది మనిషికి పనికొస్తున్నది 1శాతం మాత్రమే. అది కూడా ఇటీవల వాడకం, అజాగర్త వలన కరుమరుగైపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు నీటి కొరతను తగ్గించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఈ పద్దతి కొత్తది. ఆవుపేడ నుండి నీరు తయారుచేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 142 కోట్ల మంది నీటికరువుతో బాధపడుతున్నారు. పక్కనే సముద్రాలు ఉన్నప్పటికీ తాగునీటికి అల్లాడుతున్న ప్రాంతాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలలో కూడా ఉప్పు నీటినే మంచి నీరుగా మార్చడం ద్వారా ప్రజలు తమ తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. దానికోసం బాగా ఖర్చుపెట్టాల్సి వస్తుంది.

అందుకే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త పద్దతిని కనిపెట్టారు. ఎలాగూ పాడిపశువుల ఉంటాయి కాబట్టి, వాటి పేడతో నీటిని తయారు చేసేపద్ధతి అందరికి ఉపకరిస్తుందని ఇలా ఆలోచించారు. ఈ పద్దతిలో ఆవు పేడను నీటిశుద్ధి కోసం వనరుగా వాడుతారు. ముందు శాస్త్రవేత్తలు ఫోమ్ ను సముద్రపు నీటిపై ఉంచుతారు. దానికి ఎండ తగిలేట్టుగా ఏర్పాటు చేస్తారు. దానితో అది వేడెక్కి దిగువకు చేరుతుంది. అక్కడ నీరు ఆవిరై, దానిలో ఉప్పు, ఇతర లవణాలు విడిపోతాయి. దీనితో స్వచ్ఛమైన నీరు, ఆవిరి సూక్ష్మ గొట్టాల ద్వారా ఫోమ్ పైకి చేరుకుంటుంది. అనంతరం శాస్త్రవేత్తలు ఆ ఫోమ్ కు పలు పరికరాలు అనుసంధానం చేసి, నీటిని సేకరిస్తారు. దానిలో నుండి సేకరించిన నీరు ఎంతవరకు తాగడానికి పనికివస్తుంది అని పరీక్షిస్తారు.

ఈ పద్దతిలో ఆవు పేడతో పాటుగా ఎండిన ఆకులు, పీతలు, నత్తల షెల్స్ కలిపి వాడతారు. దానిని 1700 సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. అప్పుడు ఆ పదార్థంలో ఉన్న బాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మ జీవులు నశించి, పొడి కర్బనం మాత్రమే మిగులుతుంది. దీనికి చిక్కని నలుపు రంగు కలుపుతారు. ఇప్పుడు ఇది అతి తేలికైన ఫోమ్ గా తయారవుతుంది. సూక్ష్మ రంద్రాలతో ఉండే ఈ ఫోమ్ నీటిని సమర్థవంతంగా పీల్చుకుంటూ, ఉపరితలంపై తేలుతుంది. ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే ప్రక్రియను డీశాలినేషన్ అంటారు. ఇందుకోసం చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో వాడే ఫిల్టర్ ల ధర చాలా ఎక్కువ. చాలా విద్యుత్ ఖర్చు కూడా అవుతుంది. దానితో నీటి శుద్ధి ఖర్చు అవుతుంది. అందుకే ఈ తరహా ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: