పెళ్లి అంటే ఏడడుగుల బంధం.. మూడుముళ్ల తాళి కాదు.. అబ్బాయి లక్షణాలు అమ్మాయికి, అమ్మాయి లక్షణాలు అబ్బాయికి నచ్చడంతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినప్పుడే ఆ పెళ్లి కాస్త మూడుముళ్ల బంధం గా మారుతుంది.. ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చాలా తక్కువగానే జరుగుతున్నాయని చెప్పాలి.. కులమతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఈ మధ్య యువత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. అయితే మీరు ప్రేమించిన వ్యక్తి లో ఈ లక్షణాలు గనుక ఉంటే అసలు పెళ్లి చేసుకోవద్దు.. అంతే కాదు పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే మొదట అబ్బాయిలు కానీ అమ్మాయిల కానీ ఇలాంటి లక్షణాలు తప్పకుండా చూడాల్సిందే..

పెద్ద వాళ్లను గౌరవించాలి:
ఇంట్లో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇరువురి కుటుంబాల పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి.. ఒకవేళ మొదట మైండ్ గేమ్ ఆడి , ఆ తర్వాత నీకు నచ్చినట్టు మారుతాను అంటే ఇలాంటి వారిని అసలు నమ్మవద్దు.. ఇక ఇంట్లో పెద్ద వాళ్లకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా,  వారిని మార్చే ప్రయత్నం చేయండి.. వినకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది.

యజమానిగా ఉండడం:
సాధారణంగా అబ్బాయిలు యజమాని గా ఉండాలని కోరుకుంటారు.. ఆర్డర్లు వేస్తారు కానీ ఆర్డర్లు తీసుకోవడానికి ఏమాత్రం ముందు ఉండరు.. కాబట్టి ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకునేవారు.. యజమానిగా వ్యవహరించకుండా ఉంటేనే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.

అసూయ ,అనుమానం:
దాంపత్య జీవితం బ్రేక్  కావడానికి ఈ రెండు అతి ముఖ్య కారణాలని చెప్పవచ్చు.. అంతే కాదు ఒకరి వ్యక్తిగత విషయాలను ఇంకొకరు అడగకుండా ఇద్దరూ సమన్వయంగా జీవితాన్ని గడపడం చాలా మంచిది.


నువ్వు లేకుంటే నేను లేను :
నువ్వు లేకుంటే నేను లేను అని డైలాగు చెప్పే వారికి కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే పార్టనర్ కి కేవలం మీరు మాత్రమే సొంతం కాదు కదా.. వారికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ కూడా ఉంటారు వారిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: