బాహ్యంగా ఆకర్షించే అందం వెనుక అందరు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అందమైన రూపం ఉంటేనే ఆదరణ ఉంటుంది, అందంగా పుడితేనే వాడు బిడ్డ లేదంటే ఏ చెత్తకుండీలోనో పడేసి వెళ్లే రోజులు వచ్చేశాయి. అంతగా బాహ్యసౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే రోజులు వచ్చేశాయి. ఒకపక్క రూపం కారణంగా వ్యక్తులను కించపరచడం మానసికంగా బాధించడమే అని చట్టాలు కూడా గుర్తిస్తున్న సందర్భంలో ఈ విధంగా జరుగుతుండటం శోచనీయం. ఒకపక్క గొప్ప గా సాంకేతిక ప్రపంచం అంటూ చెప్పుకుంటూ ఇంకా అనాగరిక అలవాట్లు మనుకోలేకపోతున్నారు కొందరు. వాళ్ళ వలన కొందరు తమ జీవితాలనే కోల్పోవాల్సి వస్తుంది. అదేదో చిత్రంలో కూడా నటి లయ అంధురాలుగా జన్మించిందని తల్లి వద్దంటుంది, అలాంటివి సినిమాలలోనే కాదు జీవితంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. అదృష్టవంతులం ఇప్పటిదాకా మన చెవిన పడలేదు, ఇప్పుడు సామజిక మాధ్యమాల పుణ్యమా అంటూ అన్ని వార్తలు మనం ఎక్కడ ఉంటె అక్కడకే వచ్చేస్తున్నాయి.

సాంకేతికత కొన్ని సార్లు తీరని నష్టాన్ని చేస్తుంది, అలాగే అప్పుడప్పుడు మేలు కూడా చేస్తుంది. అలాంటి మేలు కూడా అప్పుడప్పుడు మనం అదే సామజిక మాధ్యమాలలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ సామజిక మాధ్యమాల ద్వారానే ఒకరికి మేలు జరిగింది. సమాజంలో రూపం బాగాలేదని గెంటివేయబడ్డ వ్యక్తికి ఆ మేలు జరిగింది. అదేమిటో తెలుసుకుందాం. రువాండాకు చెందిన వ్యక్తి(22) జాంజిమన్ ఎల్లి అదేదో మైక్రో సెఫాలీ అనే వ్యాధితో బాధపడుతున్నాడట. ఆ వ్యాధి మొదటి లక్షణం శిశువుగా ఉన్నప్పటి నుండి ఆ వ్యక్తి తల భాగం శరీరం కంటే చిన్నదిగా(అందరికి చిన్నగానే ఉన్నా, ఇతడికి సాధారణంగా కంటే చిన్నగా ఉంటుంది) ఉంటుంది. ఈ కారణంగా అక్కడి వాళ్ళందరూ అతడిని మోగ్లీ అని పిలుచుకునే వారు.

ఆ వ్యాధి ఉందని అందరు అతడిని కాస్త దూరంగా పెట్టడం లాంటివి కూడా చేస్తుండేవారు. దానితో అతడు మెల్లిగా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి నివసించే స్థితి వచ్చేసింది. ఉన్న ఆరోగ్య సమస్యతో పాటుగా అతడికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. తండ్రిలేకపోవడంతో తల్లి అతడిని చూసుకోలేక, అడవిపాలు చేసేది. ఇదంతా గమనిస్తున్న అక్కడి ప్రాంతీయ మీడియా అతడికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో గో ఫండ్ అనే సైట్ ద్వారా అతడికి సాయం అందించడం కోసం ప్రచారం చేసింది. అందుకు మంచి స్పందన కూడా రావడంతో మార్గం సుగమం అయ్యింది.  దీనితో ఎల్లి ప్రత్యేక పిల్లల పాఠశాలకు వెళ్తున్నాడు. అందుకు కావాల్సిన సరంజామా అంతా అతడు తీసుకోని పాఠశాలకు వెళ్తూ ఇచ్చిన పోజులు చూసి తల్లి సంతోషం వ్యక్తం చేసింది. వీళ్లు ఉండటానికి ప్రాంతీయంగా ఇల్లు కూడా సమకూరింది. ఎల్లి సూటు ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: