మనిషి తాను సాంకేతికత అనుకుంటూ పరిగెడుతూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు.దాని ఫలితాలు కూడా అనుభవిస్తున్నాడు. అందుకే కాస్త వెనక్కి తిరిగి చూడటం అలవాటు చేసుకుంటున్నాడు. దీనితో పాతకాలంలో ఇన్ని సౌకర్యాలు లేకపోయినా అంత ఆయుస్సు, ఆరోగ్యం ఎలా వచ్చాయి అనేది పరిశోధించడం మొదలు పెట్టాడు. అప్పుడు తెలిసివచ్చింది మనిషికి, సౌకర్యాలు ఎక్కువ అయితే వాటివలన ఇబ్బందులు కూడా వస్తాయి అని. కొన్ని పనులు మారు మాట్లాడకుండా ఎలా ఎలా చేయాలో అలానే చేయాలి తప్ప వాటికీ సాంకేతికతను జోడించి ఆయా ప్రకృతి సిద్దమైన వాటిని కూడా నాసిరకంగా తీర్చిదిద్దడం అవుతుందే తప్ప మరొక ప్రయోజనం ఉండబోదని తెలుసుకుంటున్నారు. అందుకే ఆహారం నుండి పండుగల వరకు అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే లోకం మళ్ళీ వెనక్కి వెళ్తుందా అని అనిపించక మానదు కానీ ఏది ఎలా చేయాలో పెద్దలు చెప్పినట్టుగా చేసుకుంటూ పోవడం ప్రకృతికి, మనిషికి చాలా మంచిదని మనిషి గ్రహిస్తున్నాడన్నది మాత్రం నిజం.

ఇక పండుగల విషయానికి వస్తే నేడు దీపావళి లాంటి పండుగ చేసుకోకూడదు అని ప్రభుత్వాలే చెప్పే స్థాయికి వాటిలో సాంకేతికతను పెంచేసి కాలుష్యాన్ని ప్రోత్సహించాము. దాని మూలంగా ఇప్పుడు అసలు పండుగ అనేది చేసుకోలేని స్థితికి వచ్చేశాము. ఇవన్నీ గ్రహించడంతో మళ్ళీ గతానికి మనిషి ప్రయాణం ప్రారంభం అయ్యింది. దానికి అనుగుణంగానే పండుగలకు సంబందించిన వనరులు కూడా ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తరహా ఉత్పత్తి రానురాను పెరగడం ఆరోగ్యమైన సమాజ స్థాపనకు అత్యవసరం. రసాయనాలు కలిపిన టపాసులు వాడటం వలన వచ్చే కాలుష్యం రెండు రకాలు, ఒకటి గాలి, రెండు శబ్దం. ఈ రెండు తీవ్రంగా జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో టపాసుల వాడకం పై నిషేధం కొన్ని ప్రాంతాలలో తప్పలేదు. అలాగే తప్పని పరిస్థితులలో వాటి వినియోగంపై కూడా సమయపాలన అనే నిబంధనను పెట్టారు.

ఇక గతంలో ఈ తరహా వేడుకలు ఎలా జరిగేవి అనేదానికి ఇంకా అక్కడక్కడా సాక్ష్యాలు మిగిలిపోవడంతో, వాటికి కొంతారు ఔత్సహికులు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. అలా టపాసులు కూడా పాతకాలం పద్దతిలో తయారీ మొదలు అయ్యింది. వీటినే ఇటీవల గ్రీన్ క్రాకెర్స్ పేరుతో(పర్యావరణ హితమైనవి లేదా తక్కువ హాని కనిగించేవి) అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విధానంలో తక్కువ ధరకు వస్తున్నాయి అని చైనా లాంటి దేశాల నుండి కూడా దిగుమతి పెరిగిపోయింది, అవన్నీ రసాయనిక మేళవింపుతో చేసినవే కావడంతో తక్కువకు లభించేవి, సామాన్యులకు అందుబాటు ధరలలో ఉండటంతో వాటినే కొనుగోలు చేసేవారు. అందువలన తాజాగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నందున కూడా పర్యావరణ వస్తువులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇకమీదట అవే అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఉత్పత్తులు వడోదర లోని హస్తకళాకారుల చేతులలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇందుకోసం పరివార్ ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓ దాదాపు నాలుగు శతాబ్దాల నాటి ఉత్పత్తులను తిరిగి భారతీయులకు అందించడం కోసం పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: