ఈ మధ్య కాలంలో టెక్నాలజీ తో పాటు ఫ్యాషన్ కూడా పెరిగి పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ శరీరాకృతికి తగ్గట్టుగా.. సమాజంలో నలుగురిలో అందంగా కనిపించడం కోసం రకరకాల ఫ్యాషన్ దుస్తులను ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా మనం వేసుకునే బట్టలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచించాలి. ముఖ్యంగా మహిళలు అయితే బ్లౌజ్ వేసుకునేటప్పుడు దానికి నెక్ లైన్ ఎలా ఉందనే విషయం కూడా వారు తప్పకుండా ఆలోచిస్తారు అట. నెక్ లైన్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా ఏదైనా ఒక రకమైన కొత్త దుస్తులను ధరించినప్పుడు మనం అందంగా కనిపించాలంటే అందుకు ఎన్నో విషయాలను ఆలోచించాలి. వేసుకునే బట్టలు క్వాలిటీ బాగుందా లేదా..? చూసేందుకు ట్రెండీగా ఉన్నాయా లేదా అనే విషయాలను తప్పకుండా చూడాలి.. మనలో చాలా మంది చేసే తప్పు ఏమిటంటే బట్టలు కుట్టేటప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ లైన్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.. కానీ నెక్ లైన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇకపోతే మనం తీసుకునే ఫ్యాబ్రిక్ స్టైల్ , క్లాత్ కలర్ కన్నా నెక్ లైన్ అనేది చాలా ముఖ్యం..

చాలామంది మొదట బట్టల రంగులను మాత్రమే చూస్తారు.నెక్  గురించి అస్సలు ఆలోచించరు.. నెక్ లైన్ చాలా అందంగా కనిపించే భాగం కాబట్టి తప్పకుండా మనం ఎలా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. చాలామంది ఇతరుల నెక్ లైన్  డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం లో ఫాలో అవుతూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు .ఎందుకంటే ఒకరు సెలెక్ట్ చేసుకున్న నెక్ లైన్ ను మన శరీరాకృతికి తగ్గట్టుగా ఉంటుంది అనుకోవడం పొరపాటు.. ముఖ్యంగా మన ఫేస్ షేప్, భుజాల తీరు, సైజు , బస్ట్ , బస్ట్  లైన్, నెక్ టైపు వంటిచాలా రకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నెక్ లైను మనకు ఇష్టమొచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోకూడదు.. మనకు ఏ విధమైన నెక్ లైన్ బాగుంటుందో అలాంటి స్టైల్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఇకపై మీరు బట్టలు కొనుగోలు చేసేటప్పుడు నెక్ లైన్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: