కెన్ స్మిత్ అతని పేరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన అడవినే ఇంటిలా భవిస్తూ అక్కడే జీవిస్తున్నాడు. అక్కడే ప్రశాంతగా బాగుందని ఆయన అంటున్నారు. గతంలో ఆయన కూడా ప్రజల మధ్యలో జీవనం గడిపినవారే. కానీ కొన్ని అనుకోని సంఘటన వలన మనసుపై ప్రభావం పడటంతో చేసేది లేక, మనుషులు ఉన్న చోట జీవించలేక అడవిలో జీవించడం ప్రారంభించాడు, అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతో అక్కడే ఇన్నాళ్లు గడిపేశారు. ఇప్పటికి అక్కడే ఉంటున్నాడు కూడా. జీవితంలో కొన్ని సంఘటనలు మనసుపై చూపే ప్రభావం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఘటన తరువాత జీవితం పూర్తిగా మారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది దాదాపుగా. కెన్ జీవితంలో కూడా అదే జరిగింది.

కెన్ డెర్బీసేన్ లో నివసించేవాడు. తన చిన్నప్పటి నుండి బ్రతకడానికి చాలా పనులు చేస్తూ ఉండేవాడు. అలా కాలం గడిచిపోతున్న వేళ ఒకరోజు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అందులో అతడికి తీవ్రమైన గాయాలు ఆయ్యాయి. ఎంతగా గాయాలయ్యాయంటే అతడికి సృహ రావడానికే 23 రోజులు పట్టింది. బ్రతకడం కష్టం అన్న స్థితి నుండి బ్రతికి బయట పడ్డాడు. అంత ప్రమాదం నుండి వచ్చిన సమయంలోనే తన తల్లిదండ్రి కూడా ప్రమాదవశాత్తు మరణించడంతో అతడి మనసుపై తీవ్రప్రభవం పడినట్టుగా ఉంది. అప్పుడు తిరిగాడు అడవి వైపు, అలా అందులోనే ఉంటూ వచ్చాడు కొన్నాళ్ళు. అడవిలో జీవనం శాంతియుతంగా, మనశాంతిగా అనిపించినట్టే ఉంది, ఇంక అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాడు.

దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నాడు. దాదాపుగా మనసు స్థిరపడటానికి 22000 మైళ్ళు నడుస్తూనే ఉన్నాడు. చివరికి స్కాట్లాండ్ లోని లొచ్ ప్రాంతంలో అతడు ఆగాడు, అక్కడే ఒక చిన్న ఇల్లు నిర్మించుకొని అందులోనే జీవనం సాగిస్తున్నాడు. నాగరిక జీవితంలో ఉండే ఎటువంటి సౌకర్యాలు అక్కడ లేకపోయినా అతడు హాయిగానే ఉంటూవచ్చాడు. అతడికి 2019లో స్ట్రోక్ వచ్చింది. అప్పటికి అతడి వద్ద ఉన్న జీపీఎస్ ద్వారా ప్రాంతీయంగా ఉన్న వైద్యశాలకు సమాచారం పంపగలిగాడు. వాళ్ళు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించి, కుదుటపడ్డాక పంపారు. అప్పటికైనా జనజీవనంలో జీవిస్తాడు అనుకుంటే, కెన్ మాత్రం మళ్ళీ అడవి లోకే వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: