విదేశాలకు వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కానీ విదేశాలకు వెళ్లడానికి వీసా లేకపోవడంతో వారు ప్రయాణించలేరు. పైగా నిరాశకు గురవుతారు. అయితే భారతదేశంలోని పర్యాటకులు లేదా నివాసితులు వీసా లేకుండా వెళ్ళే కొన్ని దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం.

నేపాల్ భారతదేశంతో కలిసి ఉన్న దేశం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌కు నిలయం కావడం వల్ల నేపాల్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నేపాల్ వెళ్లాలనుకుంటే సులభంగా ప్రయాణించవచ్చు.

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మైక్రోనేషియా ఓ ద్వీపం దేశం. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసుకుంటుంది. మైక్రోనేషియా సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం. అయితే ఇది ప్రస్తుతం పర్యాటకుల దృష్టికి దూరంగా ఉంది. మైక్రోనేషియాలో భారతీయ పర్యాటకులు 30 రోజుల వరకు ఉండడానికి అనుమతి ఉంది. కానీ దీని కోసం తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి.

భారతదేశ పొరుగు దేశాలలో భూటాన్ ఒకటి. భూటాన్ విభిన్నమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశం పర్యాటకానికి చాలా ప్రసిద్ధి. ఇక్కడకు భారతీయులు వీసా లేకుండా ఎప్పుడైనా వెళ్లవచ్చు.

ఈక్వెడార్ దక్షిణ అమెరికా తీరంలో ఉన్న ఒక అందమైన దేశం. ఈ దేశంలో స్పానిష్ భాష మాట్లాడతారు. పాస్‌పోర్ట్ ఉంటే 90 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఉంది.

జమైకా మరొక కరేబియన్ ద్వీప దేశం. వీసా లేకుండా భారతీయ పర్యాటకులు సులభంగా జమైకాను సందర్శించవచ్చు భారతీయులు జమైకాలో 14 రోజులు ఉండగలరు.

మారిషస్ తెల్లని ఇసుక బీచ్‌లతో చాలా అందమైన దేశం. భారతీయ పర్యాటకులు ఎటువంటి వీసా లేకుండా ఈ దేశాన్ని సందర్శించవచ్చు మరియు గరిష్టంగా 60 రోజులు ఇక్కడ ఉండవచ్చు.

ఫిజీ ఒక అందమైన ద్వీప దేశం. ఈ దేశం పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందింది. భారతీయులకు ఇక్కడ ప్రయాణించడానికి వీసా అవసరం లేదు.  చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంటే 4 నెలలు ఇక్కడ ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: