ఈ మధ్యకాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించని అమ్మాయి లేనే లేదు.. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో డబ్బు వెచ్చించి మరి, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను తీసుకొచ్చి ఉపయోగిస్తారు.. కొంతమంది ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెడితే , మరి కొంతమంది నార్మల్ గా బయట వాతావరణానికి తగ్గట్టుగా పెడుతూ ఉంటారు. ఇకపోతే ముఖానికి ఉపయోగించే టోనర్ తప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిందే. ముఖ్యంగా కోల్డ్ టోనర్ చర్మానికి చాలా మంచిది. అయితే ఏ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిజ్ లో ఉంచాలి.. ఏ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం..


అలోవెరా జెల్:
సౌందర్య సాధనాలలో అతిముఖ్యమైనది అలోవెరా జెల్  కాబట్టి గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచితే పాడైపోయే ప్రమాదం ఉంది.. అందుకే ఫ్రిడ్జ్ లో అలోవెరా జెల్ ను తప్పనిసరిగా ఉంచాలి.

షీట్ మాస్క్:
షీట్ మాస్క్ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది అంతేకాదు ముఖాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి..ఈ షీట్ మాస్క్ లు అనేవి ఎంత కూల్ గా ఉంటే అంత ఉత్తమంగా పని చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీరు గంట ముందు ఫ్రిజ్ లో పెట్టి తీసి ముఖానికి పెట్టుకోవచ్చు.


లిప్ స్టిక్:
సాధారణంగా ఈ లిప్ స్టిక్ లను బయట వాతావరణం లో ఉంచడం వల్ల ఒక్కోసారి అవి కరిగి పోయే ప్రమాదం ఉంటుంది.. అలాగే రంగు కూడా కోల్పోతుంది. కాబట్టి వీటిని ఎంత సేపైనా సరే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు.


ఐ క్రీమ్:
కళ్ళు చల్లగా ఉండాలి అంటే మనం ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాము.. ముఖ్యంగా మేకప్ వేసినప్పుడు కొంతమందికి కళ్ళు మండుతాయి కాబట్టి ఐ క్రీమును ఫ్రిజ్లో పెట్టి , ఆ తర్వాత అప్లై చేయడం వల్ల కంటి అలసటను కూడా దూరం చేస్తుంది.

సీరం:
చర్మ రంద్రాలను బిగుతుగా ఉంచడంలో ఈ సీరం చాలా బాగా పనిచేస్తుంది..కాబట్టి తప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో ఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: