దేశంలో మాదకద్రవ్యాల సరఫరా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఆగటం లేదు. ఒకపక్క డేగకన్నుతో అధికారులు నిరంతరం దానిని నియంత్రించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నప్పటికీ మాఫియా మాత్రం దానిని చేరవేయాల్సిన చోటుకు చేరవేస్తూనే ఉంది. ఈ తరహా వ్యవహారం ఇటీవల మరి ఎక్కువ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుకున్నారు అధికారులు. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుండి భారత్ కు ఇటీవల భారీగా ఈ మాదకద్రవ్యాలు సరఫరా జరుగుతుందని సమాచారం రావడంతో నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు దానిపై సమాచారం ఇస్తూనేఉంది. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా ఎక్కడి కక్కడ భారీగా ఈ సరఫరాలను అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారు.

ఎన్ని చేస్తున్నా మాఫియా కూడా తమ పంధా మార్చుకోకుండా ఏదో ఒక రకంగా దేశంలోకి ఈ మాదకద్రవ్యాలను చొప్పించే ప్రయత్నం చేసుంటే ఉన్నారు. తాజాగా రాజధానిలో హెరాయిన్ అక్రమంగా రవాణా నైరోబియా నుండి దుబాయ్ మీదుగా భారత్ వస్తుండగా కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ ఘటనలో 12.9 కేజీ ల మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ఉగాండా దేశస్తులు పట్టుబడ్డట్టు అధికారులు తెలిపారు. మార్కెట్ లో దీని విలువ 90 కోట్లవరకు ఉంటుంది. విమానాశ్రయంలో పట్టుబడ్డ హెరాయిన్ ను నార్కోటిక్ అధికారులకు అప్పగించారు. ఇక తెలంగాణ రాజధానిలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తాజాగా దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్నారు.

నగరానికి చెందిన యువకుడు దీనిని తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి 671.9 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ పట్టుకున్నారు. జ్యూస్ చేసే వస్తువులో బంగారాన్ని అక్రమంగా తరలించబోయి దొరికిపోయాడు. దీనివిలువ 34.18 లక్షలు ఉంటుంది. ఇలా భారత్ లోకి తాజాగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా భారీగా జరుగుతుంది, ఇక బంగారం అనేది ఎప్పటి నుండో జరుగుతున్నప్పటికీ ఈసారి కాస్త ఎక్కువ మోతాదులోనే ఇలాంటి కేసులు పట్టుకుంటున్నారు అధికారులు. ఏదో ఏమైనా ఇలాంటి సమయాలలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: