ఈ రోజు చిల్డ్రన్స్ డే... ఈ సందర్భంగా చిన్న పిల్లలు, యుక్త వయస్కులపై సాంకేతికత ఎలాంటి ప్రభావం చూపుతోంది? దాని ఎఫెక్ట్ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.

తక్కువ శ్రద్ధ :పిల్లలపై సాంకేతికత  ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. సాంకేతికత కారణంగా ఏదైనా కావాలంటే వారు వేచి ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలకు కావలసిన దానికంటే ఎక్కువగా టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అది చిన్నపిల్లలు, యుక్తవయస్కుల దృష్టిని ప్రభావితం చేస్తోంది. దీంతో వారిలో సహనం అనేది రోజురోజుకూ నశిస్తోంది. అంతేకాదు బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. అందుకే సూసైడ్ లు సైతం పెరిగిపోతున్నాయి.

సెక్యూరిటీ సమస్యలు : పిల్లలు సాంకేతిక ప్రపంచంలో పెరుగుతున్నారు. అందులో సైబర్‌ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. హ్యాకర్లు, నేరస్థులు గుర్తింపును దొంగిలించడానికి, పిల్లలను వేధించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. దీనినే సాంకేతికత దొంగతనం అనొచ్చు. అయితే వీటిపట్ల పిల్లలకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల మరిన్ని సమస్యలకు గురవుతున్నారు.

డిప్రెషన్ ప్రమాదం : టీనేజర్లు, పిల్లలు సాంకేతికత కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్రెషన్ సమస్య వారిని వేధిస్తోంది. ఇది ఆత్మహత్యల రేటును పెంచింది. మెడిసిన్, కౌన్సెలింగ్ వంటి మానసిక ఆరోగ్య జోక్యాల వైపు యువతను నడిపిస్తోంది. ఎంతో విశ్వాసంతో ముందుకెళ్లాల్సిన యువత మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడపడం లేదా సాంకేతికతను ఉపయోగించడం  కారణంగా డిప్రెషన్‌ పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇలా సాంకేతికత పిల్లల్లో అజ్ఞానాన్ని పెంచుతోంది.

ఊబకాయం : తమ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లలో లోపల ఎక్కువ సమయం గడిపే పిల్లలు బయట పరిగెత్తడానికి, ఆడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించరు. దీనివల్ల పిల్లలు మరియు యువకులలో ఊబకాయం పెరగడానికి దారి తీస్తుంది.

బెదిరింపు : సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున బెదిరింపు చర్యలు కూడా పెరుగుతున్నాయి. పిల్లలు సాంకేతికతను, సోషల్ మీడియాను ఇతర పిల్లలను వేధించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ధోరణి యువ విద్యార్థులతో కూడా పెరుగుతోంది. అంతేకాదు ఈ సాంకేతికతను అలవాటు పడిన పిల్లలు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోకుండా సాంకేతికత అనే అవివేకంలో కూరుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: