సాధారణంగా మనం పడుకునే మంచం పైన కొన్ని వస్తువులను పెట్టకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజానికి మనలో చాలామంది సంస్కృతి , సాంప్రదాయాల తో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే వారు వాస్తు విషయంలో ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయం కూడా తీసుకుంటారు.. అలాగే నడుచుకుంటారు కూడా.. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని పాటించాలి అనుకునే వారిలో కొంతమంది మంచంపై కొన్ని వస్తువులను పెట్టడం కూడా తప్పు అని చెబుతూ ఉంటారు.


ఇక వాస్తు శాస్త్ర నిపుణులు కూడా మంచం మీద ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో అశుభం, ఆర్థిక నష్టం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక మంచం పై ఏ ఏ వస్తువులు పెట్టకూడదు అనే విషయానికి వస్తే బంగారం, వెండి, గవ్వలు, ముత్యాలు , రుద్రాక్షలు వంటివి అస్సలు పెట్టకూడదా. గవ్వలు బంగారం లక్ష్మీదేవి ప్రతీకలుగా భావిస్తారు కాబట్టి వీటిని మంచంపై ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


అంతేకాదు పూజకు సంబంధించిన వస్తువులు అనగా.. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పువ్వులు, పూజ సామాగ్రి వంటివేవీ కూడా మంచం మీద ఉంచరాదట. ఇలాంటి వస్తువులను మంచంపై పెట్టడం వల్ల ఎంతో అశుభమని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. బంగారాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తాము కాబట్టి మన బెడ్ రూమ్ లో ఉండే బీరువా నుంచి తీసిన బంగారు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద పెట్టరాదట. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అశుభం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.


ముఖ్యంగా ఇలా చేయడం వల్ల మనం కొత్త ఆభరణాలను కొనుక్కోవడం పక్కన ఉంచితే , ఉన్న ఆభరణాలను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. చీపురు, చాట వంటివి కూడా మంచం మీద ఉంచరాదట. తెలుసుకున్నారు కదా..! ఇక నుంచైనా ఇలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో మంచంపై ఉంచకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: