ప్రస్తుత టమాటా ధరల విషయం గురించి ఆలోచిస్తే, తాజాగా కేంద్రం రద్దు చేసిన చట్టాలు గుర్తుకు రాకతప్పదు. రైతు వైపు నుండి ఆలోచిస్తే, ఆయన ఇప్పటి పరిస్థితిలో కూడా ఆయా రైతు చట్టాలు అమలులో ఉన్నట్టయితే తనకు లాభం వచ్చే ధర ఎక్కడ వస్తే అక్కడకు తన ఉత్పత్తిని తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. కానీ అలా కాకుండా నేడు తీవ్రమైన ధరల ఒత్తిడి తో అటు రైతు ఇటు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇష్టానికి పెరిగిపోవడం లేకపోతే పాతాళానికి తగ్గిపోవడం అనేది ధరల విషయంలో ఎప్పటి నుండో చూస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు, ఎన్నో ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నాయి. వీళ్లందరి కళ్ళముందే రైతు తన ఉత్పత్తికి గిట్టుబాటు ధర లేదని రోడ్లపై పోసి పోతున్నాడు. వీలైతే కాసింత పురుగులమందు తాను తాగేసి, ఈ రాక్షస ప్రపంచం నుండి స్వాతంత్రం పొందుతున్నాడు. ఇదే రైతు కధ.

ఇప్పటికి, ఈ తరంలో లోనే ఎన్ని సార్లు రైతు తన ఉత్పత్తిని రోడ్లపాలు చేశాడు, వేళ్ళమీద లెక్కపెట్టడం సాధ్యం కాదు. అన్నిసార్లు చేసినట్టు బహుశా గుర్తుకూడా ఉంది ఉండదు. అవన్నీ చూస్తున్నాం తప్ప ప్రజల నుండి కానీ, రైతుల్లో కానీ, ప్రభుత్వాలలో కానీ ఏమీ మార్పు లేదు. ప్రజలు అలాగే చూస్తున్నారు, రైతు రోడ్లపై పారబోసి వెళ్ళిపోతున్నాడు, ప్రభుత్వాలు కూడా మారిపోతూనే ఉన్నాయి, ఇదే  బాగోతం. రైతుకు కావాల్సింది అమ్ముడు పోవడం మాత్రమే కాదు, ప్రజలకు తక్కువ ధరలకు వస్తువులు లభించడం మాత్రమే సరిపోదు. ఇలా ఎవరి స్వార్దానికి వాళ్ళు దిగజారిపోతున్నారు కాబట్టే ఎంతో విలువైన ఉత్పత్తి రోడ్లపాలైపోతుంది. ప్రజలు, రైతులు సమన్వయము కావచ్చు, ఉత్పత్తిని తగిన ధరలకు కొనుక్కోవచ్చు. కానీ అందుకు ప్రజలు ముందు సిద్ధంగా లేరు, వాళ్లకు రైతు ఏమైపోయినా పరవాలేదు, తమకు ఎంత తక్కువకు ఇస్తే అంత తక్కువ ధరకు సరుకు కావాలి, ఛీ అని ముఖాన ఊసి, ఉచితంగా ఇచ్చినా పుచేసుకునేంత గౌరవంగా వాళ్ళు తయారయ్యారు.  

ఇక రైతు కూడా సేంద్రీయంగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. రైతు కూడా రానురాను వ్యాపారధోరణిలోకి నెట్టి వేయబడ్డాడు. దానితో ఏ వస్తువు మార్కెట్ లో డిమాండ్ ఉంటె దానిని హడావుడిగా పండిస్తున్నాడు. అది చేతికి వచ్చేసరికే దాని ధర కాస్తా నేలచూపు చూస్తుంది. ఇదే తంతు, నా తరం లో నేనే చాలా సార్లు చూశాను. రైతు ముందు పలు ఉత్పత్తులు వేయడం ద్వారా ప్రజలను రైతు క్షేత్రాలకు తీసుకెళ్లడం ద్వారా మీరు పండిస్తున్నవి సేంద్రియ పంట అని వాళ్లకు నమ్మకాన్ని కల్పించండి. సాధ్యమైనంత వరకు మీకు, వినియోగదారులకు మధ్య మూడో మనిషి లేకుండా చూసుకోండి. తద్వారా ఉత్పత్తి కోసింది కోసినట్టుగా వినియోగదారులకు చేరే విధంగా మీరే స్వయంగా ప్రజలలోకి వెళ్ళండి. అలా మార్కెట్ పెంచుకుంటే, ముందు ధరల బాధ పూర్తిగా పోతుంది. అది స్థిరానికి వస్తుంది. తరువాత పలు పంటలు ఒక్కసారి వేయడం ద్వారా ఒకటి నష్టాన్ని మిగిల్చినా మరొకటి కనీసం నిలబెడుతుంది. ఇవన్నీ ఎందరో వ్యవసాయ ప్రముఖులు చెప్పినవే. కానీ రైతు వినిపించుకోడు, ప్రజలు ముందుకు రారు, అయినా సమస్య పరిష్కారం కావాలంటారు.

అన్నీ ప్రభుత్వాలు చేయలేవు, అసలు ప్రజలు ముందుకు వస్తే, ప్రభుత్వాలు  అవసరం లేకుండానే చాలా పనులు జరిగిపోతాయి. ఈ విషయం ముందు గుర్తుపెట్టుకొని, కొన్ని ప్రజలు, ఇతర వ్యవస్థలు(వ్యవసాయం, వ్యాపార సంస్థలు) సమన్వయంతో ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇందుకు అంతర్జాతీయ సమాజంలో కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి.  అంతేకానీ, ఉత్పత్తిని రోడ్లపాలు చేసే పని మానుకోండి. ధరలకు రెక్కలొచ్చే అస్థిర వ్యాపారధోరణి అందరు మానుకోవాలి. ఇందుకు ప్రజల బాధ్యత చాలా ఉంది. రైతు, ప్రజల సహకారంతో అసలు వ్యవసాయంలో సమస్యలు లేకుండా చేసుకోవచ్చు. దానిని గమయ్యించించుకోండి ఇప్పటికైనా. ప్రతిదానికి ప్రభుత్వం అవసరం లేదు, చట్టం అవసరం లేదు. పౌరుల సమన్వయం చాలు. అదే లోపిస్తే, దానిని దేశం అనడం వృధా, వాళ్ళను పౌరులు అనడం కూడా వృధానే, తరువాత మీ ఇష్టం! ఇది ఒక మంచి నిర్ణయంతో ముందడుగు వేయగలిగిన సమయం, రండి కలిసి పనిచేసి, మనము ముందుకు వెళదాం, దేశాన్ని ముందుకు తీసుకెళదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: