సాధారణంగా ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటికి వెళ్లగొట్టడానికి ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, అధిక డబ్బు ఖర్చు, కుటుంబంలో గొడవలు ఇలా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వీటివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది అని కూడా చెబుతూ ఉంటారు. మన ఇంట్లో కొన్ని ఉండరాని వస్తువులు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఎలాంటి వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అధికంగా వచ్చి డబ్బులు రానివ్వకుండా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చెత్త బుట్ట:
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లల్లో చెత్తబుట్టలు ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే వీటిని ఇంట్లో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందట. ఈ చెత్త బుట్టలు ఉండాల్సింది బయటే కాబట్టి వాటి స్థానం అక్కడే.. తప్పని పరిస్థితుల్లో చెత్త బుట్టలను ఇళ్లలో ఉంచాలి అనుకుంటే ప్రతి రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి.

2. ఇంట్లో కుప్పలుతెప్పలుగా వస్తువులు పడేయడం:
చాలామంది వారి ఇళ్లలో వస్తువులను లేదా బట్టలను కుప్పలుతెప్పలుగా పడేస్తూ ఉంటారు ..ఇలా వేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చి డబ్బు సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడి వస్తువులు అక్కడే శుభ్రంగా సర్ది పెట్టుకోవడం నేర్చుకోండి.

3. ఎండిపోయిన మొక్కలు:
ఇంట్లో ఏవైనా మొక్కలు పెంచుకునేటప్పుడు అవి ఎండిపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది.. కాబట్టి వెంటనే వాటిని తీసివేసి వాటి స్థానంలో మరో కొత్త మొక్కలు నాటండి. మొక్కలను ఎంత బాగా పెంచితే అంత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.

మిమ్మల్ని బాధించే వస్తువులు లాంటివి కూడా ఇంట్లో వుంచుకోకండి.ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: