భారతదేశంలో హిందూ శాస్త్రం ప్రకారం హిందువులు రకరకాల సంప్రదాయాలను, ఆచారాలను అనుసరిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా వాటిలో ఒకటి కొత్త గృహంలోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగించడం. ఈ ఆచారం మన పూర్వ కాలం నుంచి వస్తున్న పద్ధతి.. అంతేకాదు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు పాలు పొంగిస్తారు. కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు పాలు ఎందుకు పొంగించాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

ఇంట్లో పాలు పొంగించడం వల్ల ఆ ఇల్లు చాలా సుఖసంతోషాలతో కలకలలాడుతూ ఉంటుందట.. సకల సంపదలకు లక్ష్మీదేవి అధిపతి కాబట్టి లక్ష్మీదేవి క్షీర సాగర మధనం జరిగినప్పుడు సముద్రగర్భం నుండి జన్మించింది.. ఇక లక్ష్మి పతి శ్రీహరి పాలసముద్రంలో పవలిస్తారు కాబట్టి పాలు పొంగించాలి అని చెబుతారు.. ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇల్లు శ్రీలు పొందిన ఇల్లు అవుతుందని హిందువుల నమ్మకం.. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అయితే ఇంటి లోకి ప్రవేశించే టప్పుడు ముందు యజమాని గోమాతను మహాలక్ష్మిగా భావించి గోమాతను ప్రవేశపెట్టిన తర్వాత యజమాని ప్రవేశిస్తాడు.

ఆడపడుచులను పిలిపించి.. గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగించేలా చేస్తారు.ఇక ఆ పాలతో పరమాన్నం తయారు చేసి వాస్తుపురుషుడు కి నైవేద్యంగా పెడతారు.. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులకు సంపదలకు లోటు ఉండదనేది నమ్మకం. దక్షిణ భారతదేశంలో అయితే కొత్త ఇల్లు కొన్నప్పుడు వాస్తు పూజ , గణేష్ పూజలతో గృహప్రవేశం జరుగుతుంది. ఇక పాలు పొంగించిన తరువాత మొదటగా దేవుడికి అర్పించి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు పంచుకుంటారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడం వల్ల సంపద, ఆరోగ్యం, ఆనందం అన్ని వస్తాయని చెబుతారు.


మొదట తూర్పు దిశలో పడితే శ్రేయస్సుకు , కీర్తి ప్రతిష్టలకు సంకేతమని.. అంతే కాదు ఆ ఇంట్లో ఉండే వారందరికీ మంచి జరుగుతుందని చెబుతారు. అందుకే తూర్పు ఆగ్నేయంలో ప్రతి ఇంట్లో వంటగది ఉండటం ఆనవాయితీ.

మరింత సమాచారం తెలుసుకోండి: