డిసెంబర్ వచ్చేసింది... అంటే ఏడాది చివరికి వచ్చేసాము. చాలామంది ఇప్పటినుంచి కొత్త సంవత్సరం కోసం ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం రోజులను వారాలను నెలకొని పట్టించుకోకుండా సరదాగా ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం సందర్భం చూసుకుని ట్రిప్స్ వేస్తారు. అయితే ఈ సమ్మర్లో ట్రై చేయాలనుకునే వారి కోసం కొన్ని టాప్ మోస్ట్ విజిటింగ్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్, చిత్తూరు

చిత్తూరులోని మదనపల్లి కి దగ్గరలో ఉన్న హార్స్లీ హిల్స్ శీతాకాలంలో విజిట్ చేయాల్సిన టాప్ ప్లేసెస్ లో ఒకటి. ఇక్కడ ఎండాకాలంలో కూడా ఎంతో చల్లగా ఉంటుందని అంటారు. 


అరకు

అరకు వ్యాలీ ని శీతాకాలంలో విజిట్ చేస్తే ఆ కిక్కే వేరు. అరకు ను ఆంధ్ర ఊటీ అని పిలుచుకుంటూ ఉంటారు. చలికాలంలో ఇక్కడ ప్రేమికులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు. 


కర్ణాటక, గోకర్ణ

ఒకవేళ బీచ్ కి వెళ్లాలి కానీ గోవాకు మాత్రం కాదనుకుంటే కర్ణాటకలోని గోకర్ణ బెస్ట్. దక్షిణ భారతదేశంలోని ఉత్తమ బీచ్ లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు


గోవా

ఎప్పుడు వెళ్ళినా గోవా అందంగానే ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ మేము లో వెళ్తే మాత్రం దాని అందం అద్భుతమనే చెప్పాలి. రంగులమయంగా ఉండే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్లాలని అనిపించదు.


కర్ణాటక, హళేబీడు

ఇది హోయసల నిర్మాణ దేవాలయాలతో కర్ణాటకలోని ప్రముఖమైన చారిత్రక నగరం. హలేబీడు ఒకప్పుడు హోయసల రాజవంశానికి రాజధానిగా ఉండేదట. అయితే ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఇస్లామిక్ దళాలు దోచుకున్నాయని అంటారు.


ఉత్తరాఖండ్, బిన్సర్

బిన్సార్ ను బీపీ టౌన్ అని కూడా పిలుస్తారు. ఉత్తరాఖండ్లోని kumaon ప్రాంతంలో 2400 20 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ అందమైన నగరం నుంచి నందాదేవి చౌడమ్మ కేదారనాథ్ తో సహా గంభీరమైన హిమాలయ శిఖరాలు అద్భుత దృశ్యం చూస్తే లైఫ్ లో మర్చిపోలేము. ఇక్కడ బీం సార్ వన్యప్రాణుల అభయారణ్యం లో కూడా కొన్ని అరుదైన జంతువులు పక్షులు పూలు జాతులు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: