ఇటీవల పర్యావరణంపై ప్రపంచ దేశాలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఒక ద్వీపదేశం అధ్యక్షుడు(తువాలు) మోకాలు లోతులో నిలబడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా మనం గమనించాం. అప్పుడు ఆయన ప్రకృతిని ఆయా దేశాలు ఎంతగా నాశనం చేస్తున్నాయనేది స్పష్టం చేయడానికి అదంతా చేశారు. అయితే ఆయన నుంచున్నది ఒకప్పుడు ఆ దేశంలో ప్రయాణానికి వాడే రోడ్డు మార్గం. కానీ అది ప్రకృతి విరుద్ధ పనులు ఎక్కువగా చేయడం ద్వారా సముద్రాలు భూమిని కొద్దికొద్దిగా ఆక్రమించేసుకుంటున్నాయి. అలా తమ భూభాగంలోకి దాదాపు 8 కిమీ మేర నీరు వచ్చిందని, భవిష్యత్తులో తమ దేశం కనుమరుగైపోవచ్చు అనే ఉద్దేశ్యంతో, బాధతో ఆయన ఆ విధంగా నాడు తన అభిప్రాయాన్ని ఐక్యరాజ్యసమితికి పంపడం జరిగింది.

అలా సముద్రాలు భూమిని కొద్దికొద్దిగా మింగేయడానికి కారణం మాత్రం పశ్చిమ దేశాలు. ఆయా దేశాలు చేసిన ప్రకృతి విరుద్ధ పనుల వలన సముద్రమట్టం పెరుగుతూనే ఉంది. అది ఆ దేశాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, అది పెద్దగా కనిపించడం లేదు. కానీ ద్వీపదేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దాదాపుగా భవిష్యత్తులో అవి కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రకృతిని విచ్చిన్నం చేస్తున్నది ఒకరైతే బాధితులు మాత్రం వేరే వారు అవుతున్నారు. ఇదంతా గమనించి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కర్బన ఉద్గారాలు తీవ్రంగా ఉత్పత్తి కావడం ద్వారా ఈ పరిస్థితులు తయారవుతున్నాయి.

ఇప్పటికే సముద్రమట్టం వద్ద ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పరిస్థితిని గమనించవచ్చు. ఉదాహరణకు ఎప్పుడైనా భారీగా వర్షాలు పడినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు సముద్రాలు ఆయా బీచ్ ల వరకు కూడా వచ్చేస్తుండటం గమనించే ఉంటారు. అలా వచ్చినది మళ్ళీ కొంత కాలానికి వెనక్కి తగ్గుతుంది. కానీ పరిస్థితి ఇలాగె కొనసాగితే ఒకనాడు శాశ్వతంగా సముద్రాలు భూమిపైకి వచ్చే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై 1990లో ఆయా ద్వీపదేశాలు కూడా దీనిపై చర్చించారు. 1991-2020వరకు మూడు రేట్లు సముద్రం పైకి వచ్చేసింది. 2100 నాటికి సముద్రమట్టాలు 5మీటర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎన్ని దేశాలు మునిగిపోనున్నాయో ఆయా దేశాలు అంచనా వేసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: