చాలామంది భారతీయులు నల్లపిల్లిని అశుభంగా భావిస్తారు. నల్ల పిల్లి అడ్డు వస్తే దరిద్రమని, దురదృష్టం, ప్రతికూలత ఎదురవుతుందని, అనుకున్న పని జరగదని నమ్ముతారు. అంతేకాదు జరగరానిది ఏదో జరుగుతుందని కూడా భావిస్తారు. అయితే నల్ల పిల్లిని కొన్ని దేశాల్లో అదృష్టంగా భావిస్తారని తెలుసా ? అవును... చాలా దేశాల్లో నల్ల పిల్లిని పెంచుకుంటారు కూడా. మన దేశంలో అయితే సాధారణంగా పిల్లి ఎదురవ్వగానే ఎక్కడి వారు అక్కడే ఆగిపోతారు. కానీ విదేశాల్లో అలా కాదు. మనకు పూర్తిగా వ్యతిరేకంగా విదేశాల్లో చాలామంది ఇళ్లల్లో పిల్లలను పెంచుకుంటారు. ముఖ్యంగా ఇతర అనేక ప్రసిద్ధ సంస్కృతులలో నల్ల పిల్లలు చాలా శుభప్రదం, సంతానోత్పత్తి, ప్రేమ శ్రేయస్సును అందిస్తాయని నమ్ముతారు. అయితే ఏ ఏ దేశాల్లో పిల్లులను శుభంగా పరిగణిస్తారు తెలుసుకుందాం.

ఈజిప్ట్
పిల్లల పిల్లలను దేవతగా పూజిస్తారు. దానిని అందమైన, తెలివైన, ఆప్యాయత కలిగిన జంతువుగా పరిగణించి ప్రేమిస్తారు. ఒక వేళ నల్లపిల్లి పెంచుకుంటున్న కుటుంబంలో అది గనక చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగి పోతుంది.

నార్వే
నార్వేలో నల్ల పిల్లులను ప్రేమకు సూచిక గా భావిస్తారు. అంతేకాదు సంతానోత్పత్తిని పెంచుతుంది అని అక్కడి నార్వేజియన్ పురాణాలు చెబుతున్నాయి. ప్రేమ, సంతానోత్పత్తికి కారణమైన అక్కడి దేవత ఫ్రీజ రథాన్ని నల్ల పిల్లులు లాగడమే దీనికి కారణంగా చెబుతారు.

స్కాట్లాండ్
ఇక్కడివారు ఏ రంగు పిల్లి అయినా సరే మీ ఇంట్లోకి ప్రవేశిస్తే... త్వరలో డబ్బు ఉ ఇంటి తలుపు తడుతుంది అనే సంకేతంగా నమ్ముతారు.

ఫ్రాన్స్
ఇక్కడ నల్ల పిల్లులను మాట్గొట్స్ అని పిలుస్తారు. ఫ్రాన్స్ లో ఉన్న మూఢ నమ్మకాల ప్రకారం నల్లపిల్లి కి సరిగ్గా ఆహారం ఇస్తే అదృష్టాన్ని తీసుకువస్తుంది అట.

జపాన్
జపాన్ లో నలుపు లేదా తెల్లని పిల్లులు తమ కుటుంబానికి శ్రేయస్సును అదృష్టాన్ని నమ్ముతారు. జపనీయుల నమ్మకం ప్రకారం నల్ల పిల్లలు చెడును, అరిష్టాన్ని తరిమికొడతాయి అట.

యూకె
బ్రిటన్లో పెళ్లి రోజున వధువు కు నల్ల పిల్లి బహుమతిగా ఇవ్వడం అదృష్టంగా భావిస్తారు. పెళ్లయిన కొత్తలో వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటే అది చెడు ముందు కొడుతుందని అంటారు. పిల్లి నలుపు రంగును అక్కడ అదృష్టంగా పరిగణిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: