భారత సమాజంలో పెళ్లిళ్ల సందడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ముహుర్తాలు ఉంటాయి, అందులో అనేక పెళ్లిళ్లు జరుగుతూనే ఉంటాయి. కానీ కరోనా వచ్చినప్పటి నుండి అవేమి లేకుండా చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ ఒక్క పెళ్లి సందడిలో ఎంతమంది ఉపాధి పొంతున్నది అందరికి తెలిసిందే. మొదటి వేవ్ లో కరోనా దెబ్బకు వీళ్లంతా దాదాపు అనేక ఇబ్బందులు పడ్డారు. పనులు లేవు, కూలి లేదు, సంపాదన లేకపోతే దాడిచే దారి లేదు. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా ఒక్క పెళ్లి సందడి లేకపోవడం వలననే. అనంతరం కూడా అనేక ఆంక్షల మధ్యనే ఈ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 50-100 వరకు మాత్రమే పెళ్లి లో పాల్గొనాలి, అది కూడా కనీస దూరం పాటించాలి, శానిటైజర్, మాస్క్ లు తప్పనిసరి.. లాంటి అనేక ఆంక్షల మధ్య జరిగాయి. ఇవన్నీ ఉంటె సందడి ఏముంటుంది.

అందుకే కరోనా లో దాదాపుగా వివాహాలు అన్ని సందడి లేకుండానే జరుపుకోవాల్సి వచ్చింది. తాజాగా మళ్ళీ కరోనా వ్యాప్తి భయం కొత్త వేరియంట్ తో ప్రారంభం అయ్యింది. దీనితో ఆయా నెలలలో పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్న వాళ్ళు కూడా అంత సమయం ఆగితే మళ్ళీ వాయిదా వేసుకొనే పరిస్థితులు వస్తాయనే ఉద్దేశ్యంతో వీలైనంత త్వరగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే వారివారి పెళ్లిళ్లు ఆయా తేదీలలో నిర్ణయించబడినప్పటికీ, వీలైనంత త్వరగా ఆయా తేదీలలో మార్పులు చేసుకుని మరి దాదాపుగా ఈ నెలలోనే కనిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహూర్తబలం అని ఒకటి, కొత్త వేరియంట్ అని, మళ్ళీ ముహుర్తాల కోసం నెల ఆగాలి అని, మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపిస్తే అనే అనుమానాలు వెరసి, అందరు డిసెంబర్ లో పెళ్లి కార్యక్రమాలను ముగించుకోవడానికి సంసిద్దులవుతున్నారు.  

ఇప్పటికే ఆంక్షలు, అందునా భవిష్యత్తుపై అనుమానాలు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే వీలైనంత త్వరగా కార్యక్రమాలను ముగించేస్తే ఒకపనైపోతుంది, తరువాత ఏమైనా అప్పుడు చూసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. కాదు కూడదు అని ముహూర్తాల కోసం జనవరి ఆఖరు వరకు లేదా ఫిబ్రవరి వరకు ఆగితే అప్పటిలోగా కరోనా తీవ్రంగా వ్యాప్తిస్తే, అనుకున్న పనులు అప్పుకోవాల్సి వస్తుంది. అందుకని, కాస్త ముందైనా పనులు పూర్తి అయితేనే శాంతిగా ఉండొచ్చని పెళ్లిళ్ల ను ముందుకు నెట్టేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంటుంది కానీ, దానికి తగ్గట్టుగా కనీసం పంతులుగారు కూడా అందరికి అందుబాటులో ఉండాలి కదా. పోనిలే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష పెళ్ళిళ్ళైనా వాళ్ళు చేయించేస్తారు. మనకు పని అయిపోవడం ముఖ్యం, వాళ్లకు మన సౌకర్యమే ప్రదానం. కరోనా చదువులు, కరోనా పెళ్లిళ్లు అనే కొత్త మాటలు మాత్రం చెప్పుకోవడానికి ఒక కధలా బాగుంటాయి, వారివారి రేపటి తరాలకు.

మరింత సమాచారం తెలుసుకోండి: