భారతదేశానికి యుగాల నుండి స్వతహాగా సంస్కృతి ఉంది. అప్పుడే ఎన్నో వైజ్ఞానికంగా విషయాలు అందుబాటులో ఉండేవి. కానీ కొందరి దురాక్రమణల కారణంగా అవన్నీ మరుగున పడటం లేదా, వాళ్ళు మన సంస్కృతి లేదా విజ్ఞాన చిహ్నాలను దోచుకోవడం లేదా నాశనం చేయడం లాంటివి చేశారు. దీనితో అవన్నీ తరువాతి తరాలకు అందుబాటులో లేకుండా పోయాయి. దోచుకున్న వారు వాటిని తిరిగి ఆయా తరాలకు పరిచయం చేయడం చుసిన వాళ్ళు అందరు, అవన్నీ వారేదో నాటి భారతీయులకు నేర్పించారని చెప్పుకొస్తున్నారు. ఇక బ్రిటిష్ వారి రాక కూడా అదేదో ఆకస్మికంగా జరిగింది కాదు, వ్యాపారం అంటూ వచ్చి  ఏకు మేకైనట్టు దేశాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలాంటివారు దేశానికి మేలు చేయడం కాదుకదా, ఇంకాస్త కీడే చేసి వెళ్ళాడు. వాళ్ళు భారతీయులకు నేర్పింది ఏమీ లేదు, సంస్కృతి అనేది వాళ్ళ దగ్గరనుండి నేర్చుకునే అగత్యం భారతదేశానికి ఏమీ లేదు.

తిండి నుండి చదువు, బట్టలు ఇవన్నీ వాళ్లే నేర్పించినట్టు కొందరు బావిస్తుండటానికి కారణం వాళ్ళ ముందు తరాలకు ఎంతమందికి భారతీయ సంస్కృతి పరిచయం. దానికి సంబందించిన విషయ పరిజ్ఞాన సూచికలు అన్ని వాళ్ళు వీళ్లు దోచుకెళ్లి, అవే మళ్ళీ పాటలుగా చెపితే నేర్చుకున్న తరాల మాటలు వింటున్న వాళ్ళు బహుశా బ్రిటిష్ వాళ్ళు భారత్ కు సంస్కృతిని నేర్పించారు అని చెప్పుకుంటూ ఉండొచ్చు. వాళ్లకు అంతకు మించి ముందు తరాల చరిత్ర తెలియదు కాబట్టి, వాళ్ళ జ్ఞానం వరకే మాట్లాడుతూ, దానినే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల చేత బానిసల్లా పని చేయించుకొని, ఉత్పత్తి అయిన వస్తువులను తమ దేశానికి తరలించుకున్నారు.

తరతరాల నుండి వస్తున్న భారత సంస్కృతిని దేశానికి బ్రిటిష్ వాడు బిక్షం వేసినట్టుగా కొందరు మాట్లాడటం పూర్తిగా అజ్ఞానం. ఇలాంటి వాళ్ళు అందరు తెలుసుకునే విధంగా ఇప్పటికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభం అయ్యింది. భారత్ లో 732000 గురు కులాలు అప్పటికే ఉన్నాయి. ఇవన్నీ మూసివేతకు కూడా ఆయా రాజులు స్వార్ధ ప్రయోజనాలు చూసుకోవడం ద్వారా బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేసేదానిలో భాగంగా చేయబడిన దాష్టికం. మన సంస్కృతికి తగ్గట్టుగా ఆనాడే ఉన్న వివిధ విద్యావిధానాలు పరికిస్తే, అగ్ని విద్యను లోహ శాస్త్రంగా, వాయు విద్యను గాలి శాస్త్రం కింద, నీటికి సంబందించిన విద్యను జలశాస్త్రంగా, స్పేస్ సైన్స్ ను  అంతరిక్ష శాస్త్రంగా, పర్యావరణాన్ని గురించి విద్యను పృద్వి శాస్త్రంగా, సౌర అధ్యయనాన్ని సూర్య విద్యగా, చంద్ర అధ్యయనాన్ని చంద్ర మరియు లోక్ విద్యగా, ఆనాడే నక్షత్రాల గమనం గురించి, మనము ప్రతి ఉగాదికి వాడే పంచాంగలే ప్రపంచానికి ఒక దిక్చుచి అని చెప్పవచ్చు. ఆయా శాస్త్రాలలో శతాబ్దం తరువాత వచ్చే  గ్రహణాలు లాంటివి కూడా సవివరంగా తెలుపబడ్డాయి.

మేఘాలను గురించి విద్యను ధాతు శాస్త్రంగా, బ్యాటరీ విద్యను దింరత్ విద్యగా, త్రేద్ద విద్యలో అంతరిక్ష పరిశోధనల గురించి, ఖగోళ శాస్త్రం ద్వారా భూగోళ విద్య, కాల విద్య సమయాన్ని అధ్యయనాన్ని గురించి, భూగర్భ విద్య జియాలజి గురించి, రత్నాలు, లోహాలు ఆకర్షణ విద్య, గురుత్వాకర్షణ విద్య, శక్తికి సంబంధించి ప్రకాశ విద్య(విద్యుత్), సంచార విద్య కమ్యూనికేషన్ గురించి, విమాన విద్య, జలియన్ విద్య ద్వారా నీటి నాళాలు, మందుగుండు సామాగ్రి విద్య, జీవజ్ఞాన విద్య జీవశాస్త్రం గురించి, జంతు శాస్త్రం లాంటివి ఇంకో 25 శాస్త్రాలు, అలాగే వ్యవసాయం, పశుపక్షాదుల పాలన, యన విద్య ద్వారా వాహన రూపకల్పన, రత్నాలు, ఆభరణాల రూపకల్పన, కంప్టారు విద్య కమ్మరి, లోహశాస్త్ర విద్య, రంగ్ విద్య డైయింగ్, రజ్జుకర్(లాజిస్టిక్స్) వాస్తుకర విద్య ద్వారా ఆర్కిటెక్ట్, వంట చేసే విద్య, వాహనాలు నడిపే విద్య, జలాంతర్గాముల విద్య, సూచికలు(డేటా ఎంట్రీ), సహోగీ(పారా మెడికల్)ల  వంటి అనేక విద్యలు ఆ నాటి విద్యాలయాలలో ఉన్నాయి. దేశం ఆక్రమించిన వాళ్ళందరూ ఆయా వ్యవస్థలను నాశనం చేసి వాళ్ళ సంస్కృతిని రుద్దడం వలన అవన్నీ కనుమరుగయ్యాయి. ఇవన్నీ తెలియకుండా కొందరు మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేయడం సరికాదు, ఒక దేశం పట్ల ప్రభావం చూపే అంశం కాబట్టి తెలుసుకొని మాట్లాడటం మంచిది, తెలియకపోతే మౌనంగా ఉంటె ఇంకా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: