గత కొన్ని సంవత్సరాల నుంచి మనం తరచూ గమనిస్తున్న విషయం ఏమిటంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు సైతం జుట్టు నెరవడం.. ఇటీవల కాలంలో ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకి కూడా మనం జుట్టు నెరవడం ని గమనించవచ్చు. సాధారణంగా పోషకాల లోపం.. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూలీ వంటి కారణాల వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది అంతే కాదు జుట్టు రాలిపోయే సమస్యలు కూడా తరచూ మనం గమనించవచ్చు. చాలామంది ఈ సమస్యను కప్పిపుచ్చడానికి జుట్టు కు రంగు వేసి సమస్యను తాత్కాలికంగా కప్పి పెడుతున్నారు.ఇక ఈ రంగులు వేయడం వల్ల జుట్టు పాడవడంతో పాటు కంటి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ జుట్టు ఎందుకు తెల్లబడుతుంది అనే విషయాన్ని మీరు విశ్లేషించగలిగినట్లయితే అందుకు తగినట్లుగా జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందుకోసం మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పకుండా జుట్టు నల్లగా మారడం అంతేకాదు జుట్టు రాలే సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఉసిరి, హెన్నా తో మీరు ఒక హెయిర్ ప్యాక్ ను తయారు చేయవచ్చు.. ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు వేయడం వల్ల తెల్ల జుట్టును మనం నివారించవచ్చు.. ఇందు కోసం మీరు గోరింటాకు ని తీసుకుని మెత్తని పేస్టులా తయారుచేసి అందులో మూడు టేబుల్ స్పూన్ల  ఉసిరి పేస్ట్ లేదా ఉసిరి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ళ నుంచి బాగా చివరి కొనల వరకు పట్టించి తడి ఆరేవరకు అలానే ఉండాలి.. ఇప్పుడు ఘాడత  తక్కువ కలిగిన నాణ్యమైన షాంపూతో చల్లని నీటితో తలస్నానం చేయాలి.. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి నేచురల్ కలర్ రావడం తో పాటు జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.. మీరు కూడా ఇలా తెల్ల జుట్టు తో ఇబ్బంది పడుతుంటే రంగులు వేయడం ఆపివేసి ఈ చిట్కా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: