మన ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ముఖ్యంగా వంటగదిని ప్రతిరోజు కూడా తప్పని సరిగా శుభ్రం చేసుకోవాల్సిందే..లేకపోతే వంటింట్లోకి వచ్చే క్రిమి కీటకాలు, బొద్దింకల వల్ల మనం తినే ఆహారం వల్ల కూడా మనకు ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువ.. కాబట్టి ఎప్పటికప్పుడు వంటగది తో పాటు వంట గదిలో ఉండే వస్తువులను కూడా మనం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.. కొన్ని కొన్ని సార్లు ఎంత శుభ్రం చేసినా వంట పాత్రలకు మరకలు అలాగే ఉండిపోవడం , కాఫీ కప్పులకు , గ్యాస్ స్టవ్ మీద మరకలు ఉండిపోయి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ చిట్కాతో వంటింటి సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు.


ఇనుప పెనాలు ఉపయోగించిన తర్వాత ఎంత శుభ్రం చేసినా..వాటికి పట్టేసిన జిడ్డును వదిలించడం మాత్రం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా ఉప్పు తీసుకొని పెనం మీద దట్టంగా వేసి  పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని పెనం మీద తుడిచి నట్లయితే ఎంతటి పట్టేసిన జిడ్డు అయినా సరే సులభంగా వదులుతుంది. ఆ తర్వాత మీరు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

ఒకసారి కాఫీ , టీ తాగే పింగాణీ కప్పుల మీద మరకలు పడితే అవి తొలగి పోవడం అసాధ్యం. ఒక్కోసారి మనం అలాగే టీ, కాఫీ కప్పులు వదిలేయడం చేస్తూ ఉంటాము.. ఈ మరకలు తొలగించాలి అంటే కప్పులు మీద గార ఉన్నచోట ఉప్పు చల్లి కొద్దిసేపు పక్కన ఉంచి ఆ తర్వాత శుభ్రం చేస్తే ఎటువంటి మరకలు అయినా సరే సులభంగా తొలగిపోతాయి.

గ్యాస్ స్టవ్ మీద పేరుకుపోయిన పదార్థాలను కూడా మనం ఈ ఉప్పు ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగంటే బర్నర్ వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు చల్లి ఆ తర్వాత పొడిగుడ్డతో శుభ్రం చేసినట్లయితే స్టవ్ కూడా శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: