కొంతమంది భార్యాభర్తలు మానసికంగా తగాదాలు పడుతూ ఉంటారు. అయితే వాటిని పరిష్కరించుకునేందుకు.. ఎక్కువగా కొన్ని టిప్స్ వంటివి పాటిస్తూ ఉంటారు. ఈ బాధలనుండి విముక్తి పొందడానికి కొన్ని జంటలు మధ్యవర్తుల సలహాను కూడా అడుగుతూ ఉంటారు. అయితే సులభంగా కొన్ని వాస్తు నివారణ లను పాటించడం వల్ల.. అలాంటి తగాదాలు లేకుండా ఉంటాయి అని కొంతమంది వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా పడకగది విషయంలో కొన్ని సూచనలు పాటిస్తే ఇలాంటి తగాదాలు,విడిపోకుండా జంటగా ఉంటారట.అయితే వాస్తు ప్రకారం గదిని కట్టినప్పటికీ.. లోపల ఉండే వస్తువులను మనం సరిగ్గా ఉంచకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.ముందుగా మనం నిద్రించేటప్పుడు వేసుకొనే పరుపును ఉత్తర దిశలో ఉంటే నైరుతి దిశ వైపు గా మార్చాలి.. కేవలం తలను ఎప్పుడూ దక్షిణం లేదా తూర్పువైపున ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మనం నిద్రించే మంచం చెక్క మంచం మే అయి ఉండాలి.. ఇనుముతో తయారు చేసినది అయితే ప్రతికూల ప్రకంపనలను సృష్టిస్తోందట. భార్య భర్తలు ఎప్పుడు ఒకే పరుపు పైన పడుకోవడానికి ప్రయత్నించాలట.. ముఖ్యంగా రెండు చిన్న పరుపులు వంటివి కలపకూడదు. అలాంటి వాటి మీద అసలు నిద్రించకూడదు.. మంచం ఏదైనా మూల ఉండకుండా చూసుకోవాలి.. అయితే వారంలో ఒకసారి అయినా బెడ్ రూము మొత్తం నీటితో కాకుండా ఉప్పు వేసిన నీటితో తుడుచుకోవాలి ఇది నెగెటివ్ ఎనర్జీని తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. బెడ్ పై కేవలం రెండు దిండ్లు ను మాత్రమే ఉండేలా చూసుకోవాలి. బెడ్ రూమ్ లో మనకు అనుకూలమైన ఫోటోలు మాత్రమే తగ్గించుకోవాలి. ఇక అంతే కాకుండా యుద్ధ సన్నివేశాలు ఫోటోలు, ఏడుస్తూ ఉన్నటువంటి ఫోటోలను బెడ్రూంలో ఉంచరాదు. మనం ఎల్లప్పుడు ఎక్కడైనా సరే గజిబిజిగా ఉండకూడదు. బెడ్ రూమ్ లో ఎప్పుడు ఏకాంతంగా ఎవరు ఉండకూడదు.. అది మీ ఒంటరి తనానికి దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: