ఈరోజుల్లో పెళ్లిళ్లు చాలా ఆలస్యం అవుతున్నాయి. 30 ఏళ్లు వచ్చే వరకూ చాలా మంది పెళ్లి పీటలు ఎక్కడం లేదు. పర్సనల్ లైఫ్ కంటే కేరీర్‌ లైఫ్‌కే ఇంపాంర్టెన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు పెళ్లిళ్లు చాలా ఆలస్యం అవుతున్నాయి. అయితే.. 30 దాటాక సంబంధాలు దొరకడం కాస్త కష్టమే.  ఇక మన ప్రభాస్ వంటి స్టార్లయితే.. 40లు దాటిపోయినా పెళ్లి మాటే ఎత్తరు. కానీ ఈ జనరేషన్‌లోనూ ఓ యువతి 30ఏళ్లకే బామ్మ అయిపోయింది. బామ్మ అంటే.. ఏదో వరుసకు బామ్మ కాదండోయ్.. నిజంగానే మనవడిని ఎత్తుకుంది.


30 ఏళ్ల వయస్సుకే మనవడు ఎలా సాధ్యం.. ఇంపాజిబుల్ అనిపిస్తోంది కదా..కానీ ఇది నిజంగా జరిగిన కథే. లండన్ కు చెందిన కెల్లీ హీలే వింత కథ ఇది. ఈ కెల్లీ హీలే ఏకంగా 14 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. విచిత్రం ఏంటంటే.. కెల్లీ కూతురు స్కై సాల్టర్‌ కూడా తల్లి బాటలోనే ప్రయాణించింది. ఆమె కూడా 14 ఏళ్ల వయస్సులోనే ఓ పిల్లాడికి తల్లయింది. ఇలా ఈ తల్లీ కూతుళ్లు చిన్న వయస్సులోనే తల్లులు కావడం వల్ల ఈ కొత్త రికార్డు సాధ్యమైంది. కెల్లీ కేవలం 30 ఏళ్లగా బామ్మ అయిపోయింది. ఇప్పుడు కెల్లీ బ్రిటన్ లోనే అత్యంత యువ అమ్మమ్మగా రికార్డు సృష్టించింది.


మరో విచిత్రం ఏంటంటే.. 14 ఏళ్లకే తొలి బిడ్డను కన్న కెల్లీ.. ఆ తర్వాత మరో నలుగురికి జన్మనిచ్చింది. అలా 30 ఏళ్లకే ఐదుగురు బిడ్డలకు తల్లయింది కెల్లీ.. తనకు జరిగినట్టే తన కూతురు కూడా చిన్న వయస్సులో తల్లి కాకూడదని పాపం.. కెల్లీ చాలా ప్రయత్నించింది. కానీ.. విధిరాత తప్పలేదు. 13 ఏళ్ల వయస్సులోనే సహజీవనం ప్రారంభించిన స్కై సాల్టర్‌ అనుకోకుండా గర్బవతి అయ్యింది. ఆమెకు గర్భంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో నాలుగైదు నెలలు వచ్చే వరకూ తల్లికి విషయం చెప్పలేదు. ఆ తర్వాత విషయం తెలిసినా అబార్షన్‌కు సమయం మించిపోయింది. దాంతో ఇక బిడ్డను కనాలనే స్కై సాల్టర్ కూడా నిర్ణయించుకుంది. అలా స్కై సాల్టర్  2018 ఆగస్టులో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: