మన చుట్టూ ఉండేటువంటి కాయగూరలలో కాకరకాయ కూడా ఒకటి. ఈ పేరు వినగానే ఎక్కువమందికి చేదు అనే పదం గుర్తుకొస్తుంది. ఈ కాయలు తిన్న వ్యక్తి నోరు అంత చేదుగా ఉంటుంది. అందుచేతనే ఈ కాకరకాయ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. పిల్లలు కూడా వీటి నుండి దూరంగా ఉండడానికి చాలా లైక్ చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి, రక్తం శుద్ధి చేయడానికి ఇచ్చేది చాలా ఉపయోగకరంగా ఉంటుందట. అయితే ఈ చేదు తొలగించుకోవడానికి మనం కొన్ని సులభమైన పద్ధతులను తెలుసుకుందాం.

1). ఉప్పు వాడకం:
కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. కానీ వాటి చేదు కారణంగా కొంతమంది వీటిని దూరం పెడుతూ ఉంటారు. అయితే కాకరకాయను కట్ చేసి రాత్రంతా అందులోకి కొద్దిగా ఉప్పు వేసి ఉంచడం వల్ల కాకరకాయ చేదు ఉండదట.


2). పెరుగును వాడకం:
మనం తినేటువంటి పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు. అయితే ఇందులో ఉండే మూలకాలు చేదు ను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. అందుచేతనే కాకరకాయ చేదు ను పోగొట్టడానికి.. ఈ కాకరకాయ ముక్కలను పెరుగులో నానబెట్టడం వల్ల చేదు ఉండవు.

3). పొట్టు వాడకం:
పొట్లకాయ కూడా అత్యంత చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు వాటిని తొలగించడానికి దాని పైన ఉండే తొక్కను తీసి వేస్తే.. చేదు తొలగిపోతుంది. ఆ తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి కనుక వాటిని అలా చేయకుండా ఉప్పులో కాసేపు నానబెట్టి ఆ తర్వాత తీసిన కూడా కాస్త చేదుగా అనిపిస్తుంది ఆ తర్వాత మసాలా లో వాటిని బాగా వేయించి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

4). మసాలా:
ఏ కూరగాయలు అయినా చేదు ఉన్నప్పుడు కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తే ఆ చేదు తగ్గించవచ్చు. అయితే ఈ సారి కాకరకాయ కూర వండేటప్పుడు అందులో ఉల్లిపాయలు, మెంతులు, వేరుశెనగ లను ఉపయోగిస్తే చేదు తగ్గుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: