ప్రస్తుతం ఎండ వేడికి అరటిపండ్లు వెంటనే కుళ్ళి పోతూ ఉంటాయి.. అయితే అరటి పండ్లు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలట. అరటిపండ్లలో సహజంగా లభించే పాలీ ఫినాల్ యాక్సిడెంట్ అనే ఎంజైమ్ లు ఉండడం వల్ల త్వరగా కాయలు మాగుతూ ఉంటాయి. ఈ పాలీ ఫినాల్ యాక్సిడెంట్స్ అనేది ఒక వర్ణద్రవ్యం వంటిది. ఇవి వాటి మీద ఉండే చర్మం రంగును మారుస్తూ ఉంటారు. అంతే కాకుండా వీటిని ఎక్కువగా ఉంచితే చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. అందువల్లే అరటిపండ్లు చెడిపోతాయి. అయితే అలా కాకుండా ఉండాలి అంటే ఇలా చేస్తే సరి.

1). సోడా నీళ్లు:
ఒక లీటరు నీటిని తీసుకొని అందులో కాస్త బేకింగ్ సోడా వేసినట్లయితే.. అందులోకి అరటిపండ్లు ఉంచితే అరటి పండ్లు తొక్కల పై ఉండే రంగు వెంటనే నల్లబడదు. ఏ కాయ నైనా తాజా గా ఉంచేందుకు బేకింగ్ సోడా చాలా సహాయపడుతుంది.

2). పండ్ల రసం లో నానబెట్టడం:
అరటి పండ్లు ఎక్కువ కాలం ఉండాలి అంటే.. ఏవైనా కాయల నుండి వచ్చిన రసం లో వాటిని కొన్ని నిమిషాలు ఉంచి ఆ తర్వాత గుడ్డ తో తుడిచి ఉంచితే పాడవకుండా ఉంటాయి.

3). సిట్రిక్ యాసిడ్:
ఎక్కువగా పచ్చళ్ళు చెడిపోకుండా ఉండేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారు. వీటి ని వాడడం వల్ల రుచి రంగు అలాగే ఉంటుంది. వీటిని నేరుగానే వాడకుండా.. కాస్త కప్పు లో ఉంచి ఆ తర్వాత వాటిని నానబెడితే అవి యధావిధిగా ఉంటాయి.

4). గాలి చొరబడని ప్రదేశం:
అరటిపండ్లు ఎక్కువగా గోధుమ రంగులోకి మారుతుంటాయి. ఎందుకంటే అవి గాలి నుండి ఆక్సిజన్ని ఆస్వాదిస్తాయి కాబట్టి. అందుచేతనే వీటిని గాలి చొరబడని చోట నిల్వ ఉంచితే మంచిది. మైనపు కాగితం ద్వారా అరటి పండ్లను చుట్టి ఉంచితే గాలి ఇందులోకి చొరబడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: