మీరు హైదరాబాద్ వాసులా.. అసలే ఇవాళ ఆదివారం.. అందుకే ఈ కార్యక్రమం అస్సలు మీరు మిస్ కావద్దు.. ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటనుకుంటున్నారా. అదే 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్ షో.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో మూడు రోజులుగా ఆ ఏవియేషన్ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్య ఒప్పందాలే ఇక్కడ జరిగాయి. శని, ఆదివారాల్లోనే సాధారణ పౌరులకు అవకాశం ఇచ్చారు.


దీంతో నిన్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇవాళ కూడా జనం బాగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రన్‌వేపై నిలిచిన విమానాలను బారికేడ్‌ అవతలి నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నారు. విమానాలను ఇంత దగ్గరగా చూడటంసరికొత్త అనుభూతినిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం విమానాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లేదని కొందరు నిరుత్సాహానికి  గురవుతున్నారు.  


ఈ షోకు ఉదయం 9గంటల నుంచి సందర్శకులను లోపలికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు, సాయంత్రం 4గంటలకు రెండు సార్లు ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఈ షో ప్రధాన ఆకర్షణగా ఉంది. ప్రత్యేకించి పిల్లలకు ఈ ఏవియేషన్ షో చాలా బాగా నచ్చుతుంది. అంతే కాదు.. మీ పిల్లలకు భిన్నరకాల విమానాలపై  ఆసక్తి, అవగాహన కలుగుతాయి. ఇక ఇక్కడ ప్రదర్శనలో ఎయిర్ బస్ A-350 ఏవియేషన్ షో లో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇలాంటి విమానాలు చూడాలింటే.. ఇలాంటి ప్రత్యేకమైన ప్రదర్శనల్లోనే అది సాధ్యం సుమా.. ఈ విషయం మరచిపోకండి.


ఇక ఈ ఏవియేషన్ షో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇక్కడ నిర్వహిస్తున్న పలు స్టాళ్లను ఆయన సందర్శించారు. స్టాళ్ల  నిర్వాహకులతో మాట్లాడారు. అసలే ఆదివారం.. అందుకే ఇవాళ ఫ్యామిలీతో బేగం పేట వెళ్లండి.. ఏవియేషన్ షో చూసి ఆనందించండి. మళ్లీ ఎప్పుడో కానీ.. ఇలాంటి అవకాశం రాదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: