ప్రస్తుత కాలంలో ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి.. ఈ ఎండల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే కొన్ని రకాలైన జ్యూసులను తాగుతూ ఉండాలి. అవి కూడా మన వంటింట్లో దొరికేటువంటి వాటితోనే ఇలాంటివి చేసుకోవచ్చు వాటి గురించి తెలుసుకుందాం.

1).మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండాలి అంటే కచ్చితంగా గ్రీన్ టీ తాగాల్సిందే. ఇది తాగడం వల్ల మన  కాలేయం , గుండే ఆరోగ్యంగా ఉండడంతోపాటు గా మధుమేహం, ఊబకాయం వంటివి తగ్గిపోతాయి. అయితే గ్రీన్ టీ చేదుగా ఉండకుండా ఉండాలి అంటే అందులో కొద్దిగా తేనె కలుపుకొని తాగడం చేయాలి.

2). సోయా, పాలను తీసుకోవడం వల్ల వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ డి చాలా పుష్కలంగా లభిస్తుంది. మరొకవైపు జీర్ణవ్యవస్థ కూడా బలహీనంగా ఉంటే.. సోయాపాలు అందుకు ఉత్తమమని చెప్పవచ్చు

3). కాఫీ ని ఎక్కువగా ఈ ఎండాకాలంలో తాగడం మంచిది కాదు. కానీ  ఒక్కసారి తీసుకున్నట్లు అయితే గుండె జబ్బులు మటుమాయమవుతాయట. దీంతో పాటుగా కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం మన శరీరాన్ని చాలా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది.

4). మనం ఏదైనా సీసాలో నీటిని నింపి అందులో కి కొన్ని విపండ్లు వేసి.. కాస్త దాల్చిన చెక్క, నారింజ, పుదీనా ఫ్లవర్ లను ఆ నీటిలో వేసి వాటిని తాగితే వేడి నుంచి ఉపశమనం వెంటనే లభిస్తుంది.

5). మన వంటింట్లో దొరికే కూరగాయలలో మనము ఎక్కువగా తినిది  క్యారెట్ అని చెప్పవచ్చు.. అయితే వీటిని జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ బాగా మన శరీరానికి ఉంటాయట. అంతేకాకుండా మన శరీరంలో ఉండే రక్తనాళాలు బాగా పని చేయడంతో మెదడు చాలా చురుకుగా పని చేస్తుందట.

ఇక ఇదే కాకుండా ఏవైనా కాయలు, కాయగూరల ద్వారా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మరి మంచిది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: