ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనిపించాలని ఎంతో తాపత్రయ పడుతూ ఉంటారు. ముఖం మీద మచ్చలు లేకుండా మెరిసి పోవాలనే అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న కాలుష్యం కారణంగా ఇలాంటి ముఖం కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరికీ చాలా కష్టమనే చెప్పాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే వాటితో ముఖం చాలా అందంగా మెరుస్తుంది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


పసుపు - శెనగపిండి:
పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటే శెనగపిండి చర్మాన్ని గ్లో గా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి పేస్ట్ లాగా  తయారు చేసి  ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తాజాగా మెరవడమే కాకుండా చర్మంపై పేరుకుపోయిన మలినాలు కూడా దూరమవుతాయి . అలాగే చర్మం  మీద వుండే మచ్చలు కూడా నయం అవుతాయి.

కలబంద: ప్రతి ఒక్కరి పెరటిలో లభ్యమయ్యే మొక్కలలో కలబంద కూడా ఒకటి. కలబంద నుంచి తీసిన జెల్ ను  ఎక్కువగా చర్మ సంరక్షణలో , కేశసంరక్షణ లోఎక్కువగా ఉపయోగిస్తారు. కలబంద కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా చాలా చక్కగా పనికొస్తుంది. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా కలబందను ఉపయోగిస్తారు అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా చాలామంది కలబందను ఉపయోగించడం కష్టంగా భావించినా  అప్లై చేయడం మాత్రం చాలా సులభం. కాబట్టి కలబంద గుజ్జును ఉపయోగించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

టమోటా:
టమోటా లో ఉండే కొన్ని రకాల పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం లో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. ముఖం పై వుండే మచ్చలు , మొటిమలు దూరం చేయడంలో టమోటా  చాలా మేలు. కాబట్టి టమోటా రసంతో ముఖానికి ఫేస్ ప్యాక్ లు వేసుకున్నా సరే ముఖం మీద మచ్చలు తొలగిపోయి చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: